Advertisementt

బాలకృష్ణ కు తృటిలో తప్పిన ప్రమాదం!

Thu 30th Jun 2016 12:25 PM
balakrishna,accident,hindupur,car accident,nandamuri hero,karnataka,hyderabad  బాలకృష్ణ కు తృటిలో తప్పిన ప్రమాదం!
బాలకృష్ణ కు తృటిలో తప్పిన ప్రమాదం!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురం లో పర్యటిస్తూ తన 101 సినిమాని ఎనౌన్స్ చేసాడు. తన 101 వ సినిమా పేరు 'రైతు' అని అది కృష్ణ వంశీ దర్శకత్వం లో ఉంటుందని ప్రకటించాడు. తరవాత నియోజకవర్గం లో కొన్ని అభివృద్ధి పనులలో పాల్గొని తిరిగి హైద్రాబాద్ బయలుదేరిన బాలకృష్ణ కి తృటిలో ప్రమాదం తప్పింది. కర్ణాటక లోని బాగేపల్లి సమీపం లో బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు టైర్ పేలి డివైడర్ ని ఢీకొట్టింది. కారు ప్రమాదం జరిగినప్పుడు కారులో బాలకృష్ణ వున్నాడు. కానీ ఎటువంటి గాయాలు తగలకుండా తృటిలో తప్పించుకున్నాడు. ఈ వార్త విన్న అభిమానులు షాక్ కు గురైయ్యారు. కానీ బాలయ్య సేఫ్ గా బయట పడడం తో కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నేను ప్రాణాలతో బయటపడడానికి కారణం నా తల్లితండ్రుల ఆశీస్సులే అని బాలయ్య అన్నాడు. తరవాత మరో కారులో ఎయిర్ పోర్ట్ కి చేరుకుని హైద్రాబాద్ వెళ్ళిపోయాడు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ