Advertisement

బిజెపి, కాంగ్రెస్‌లకు ఇదేం పోయే కాలం!

Sat 18th Jun 2016 06:43 PM
uttar pradesh elections,cm race,bjp,congress,sheela dixit,rajnath singh  బిజెపి, కాంగ్రెస్‌లకు ఇదేం పోయే కాలం!
బిజెపి, కాంగ్రెస్‌లకు ఇదేం పోయే కాలం!
Advertisement

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. కాగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బిజెపి, కాంగ్రెస్‌లు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఒకపక్క బిజెపి తరపున వరుణ్‌గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్దిగా నిలబెట్టాలని ఆ రాష్ట్ర నాయకుల నుంచే కాక ఆర్‌ఎస్సెస్‌ నుండి కూడా నరేంద్రమోడీపై ఒత్తిడి వస్తోంది. కానీ వరుణ్‌గాంధీ అభ్యర్దిత్వంపై మోదీ సానుకూలంగా లేడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన యూపీ సీఎంగా తన విధేయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను బరిలో నిలపాలని తాపత్రయపడుతున్నాడు. అదే జరిగితే యూపీ ఎన్నికల్లో బిజెపి గెలుపు అంత సులభం కాకపోవచ్చు. మరోవైపు కాంగ్రెస్‌ నుండి ప్రియాంకాగాంధీని సీఎం అభ్యర్దిగా ప్రకటించాలని ఆ రాష్ట్ర నాయకుల నుండి అభ్యర్ధనలు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అనూహ్యంగా మాజీ డిల్లీ సీఎం షీలాదీక్షిత్‌ను సీఎం అభ్యర్దిగా నిలబెట్టాలనే ఆలోచనలు చేస్తుండటం విశేషం. షీలాదీక్షిత్‌ను డిల్లీ ప్రజలు ఆమెను ఓడించి ఆమె పరిపాలనాధ్యక్షురాలు కాదని తేల్చిచెప్పారు. కానీ యూపీలో బ్రాహ్మణుల ఓట్లు పార్టీలకు కీలకంగా కానున్నాయి. అక్కడ మెజార్టీ ఓటర్లలో బ్రాహ్మణులు ముఖ్యులు. అందుకే షీలాదీక్షిత్‌ను రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తోంది. మొత్తానికి బిజెపి తరపున రాజ్‌నాథ్‌సింగ్‌, కాంగ్రెస్‌ తరపున షీలా దీక్షిత్‌ అభ్యర్ధులు అయితే ఇక బిఎస్పీ, సమాజ్‌వాదీపార్టీలకు పండగే పండగ..!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement