Advertisement

వారికి కోదండరాంను విమర్శించే హక్కుందా!?

Sat 18th Jun 2016 06:29 PM
kodandaram,tjac,telangana,trs leaders  వారికి కోదండరాంను విమర్శించే హక్కుందా!?
వారికి కోదండరాంను విమర్శించే హక్కుందా!?
Advertisement

జేఏసీ చైర్మన్‌ కోదండరాం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల రగడ ఇంకా చల్లారలేదు. ఇప్పటికీ ఈ విషయంలో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మీడియా ఎదుట కాకుండా ఆఫ్‌ ది రికార్ద్‌గా ఈ విషయంపై నాయకులు తమ సన్నిహితులతో చర్చిస్తున్నారు. కోదండరాం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు టిఆర్‌ఎస్‌లో హరీష్‌రావు నుండి కింది స్దాయి నేతల వరకు కోదండరాంను టార్గెట్‌ చేశారు. హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌ వంటి తెలంగాణ ఉద్యమనాయకులు కోదండరాంపై విమర్శలు చేశారంటే అర్ధముంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించకుండా, తప్పించుకొని తిరిగి.. ఇప్పుడు అధికార టిఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్‌, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకులకు కూడా కోదండరాంను విమర్శించే నైతిక హక్కు ఉందా? అని తెలంగాణ ఉద్యమకారులు తమలోని అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల తమ పార్టీకి ఉన్న పరువు పోతోందని, అదే విషయాన్ని హైలైట్‌ చేస్తూ ఆయా నాయకులను కోదండరాం టార్గెట్‌ చేస్తే వారి భవిష్యత్తు ఏమిటి? అని నిజమైన ఉద్యమకారులు కారాలుమిరియాలు నూరుతున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement