Advertisementt

మన స్టార్స్‌ ఆస్తులు ఎంతెంత...?

Fri 20th May 2016 05:25 PM
tollywood stars,personal life,habits,remunerations,movies,ads,mahesh babu,nagarjuna,jr ntr  మన స్టార్స్‌ ఆస్తులు ఎంతెంత...?
మన స్టార్స్‌ ఆస్తులు ఎంతెంత...?
Advertisement
Ads by CJ

సినిమా స్టార్స్‌కు సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తిని కలిగిస్తుంటుంది. పర్సనల్‌ లైఫ్‌స్టైల్‌, వారి అలవాట్లు, అభిరుచులు, తీసుకునే రెమ్యూనరేషన్‌, సినిమాలే కాకుండా ఇతర మార్గాల్లో వారి సంపదన, ఆస్తుల వివరాలు... గట్రా తెలుసుకోవడానికి సామాన్యులు సైతం ఆసక్తిని చూపిస్తుంటారు. కాగా ప్రస్తుతం స్టార్ల ఆస్తులనే లెక్కలోకి తీసుకుంటే తెలుగు స్టార్స్‌లో ఎక్కువ ఆస్తులు ఉన్న స్టార్‌గా నాగార్జున నెంబర్‌వన్‌ ప్లేసులో నిలుస్తున్నాడని ఓ సర్వే ప్రకటించింది. నాగ్‌ ఆస్తుల విలువ 3వేల కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. ఇక రామ్‌చరణ్‌ విషయానికి వస్తే అపోలో సంస్ధల చైర్మన్‌ అయిన ప్రతాప్‌ సి.రెడ్డి మనవరాలు ఉపాసనను పెళ్లి చేసుకున్న చరణ్‌ ప్రస్తుతం ఎయిర్‌లైన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఈయన ఆస్తుల విలువ 2,800కోట్లు అని అంచనా. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే అప్పట్లో స్టూడియో ఎన్‌ అధినేత కూతురును పెళ్లాడని ఎన్టీఆర్‌ ఆస్తుల విలువ సుమారు వేయి కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇక నాలుగో స్థానానికి వస్తే బాలకృష్ణకు 800కోట్ల ఆస్తులున్నాయట. ఇక టాలీవుడ్‌లో నెంబర్‌వన్‌ హీరోగా కొనసాగుతున్న మహేష్‌బాబు సినిమాల రెమ్యూనరేషన్స్‌తోపాటు వాణిజ్య ప్రకటనల విషయంలో కూడా ముందుండి ఆస్తుల విషయంలో మాత్రం ఐదో స్దానంలో నిలుస్తున్నాడని ఆ సర్వే తేల్చింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ