Advertisement

జగన్‌ వ్యూహాత్మక అడుగులు...!

Fri 20th May 2016 05:02 PM
jagan,ysrcp,kodali nani,vangavveti radha,harikrishna,jr ntr  జగన్‌ వ్యూహాత్మక అడుగులు...!
జగన్‌ వ్యూహాత్మక అడుగులు...!
Advertisement

ఓవైపు వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు టిడిపిలో చేరిపోతుంటే నిన్నటివరకు క్షోభ అనుభవించిన జగన్‌ ఇప్పుడు మాత్రం తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. పార్టీని వీడిన ఎమ్యెల్యేల స్దానంలో బలమైన వారిని జగన్‌ ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ పార్టీ మారిన ఎమ్మేల్యేలకు కౌంటర్‌ ఇస్తున్నాడు. నిన్ననే వంగవీటి రాధాకు విజయవాడలో కీలకబాధ్యతలు అప్పగించిన ఆయన తాజాగా గుడివాడ ఎమ్యేల్యే కొడాలి నానికి కీలక బాధ్యతలు అప్పగించాడు. కొడాలి నాని నందమూరి ఫ్యామిలీలోని ఎన్టీఆర్‌కు, హరికృష్ణకు ముఖ్య అనుచరుడు కావడం ఇక్కడ గమనార్హం. కొడాలి నానిని ఆయన వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించాడు. టిడిపికి కంచుకోట అయిన కృష్ణాజిల్లాలోని గుడివాడ ఎమ్మేల్యే అయిన కొడాలి నానికి ఈ బాద్యతలను అప్పగించడం రాజకీయంగా కీలక నిర్ణయమే అని చెప్పాలి. ఇక వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన కొలుసు పార్ధసారధికి ఆయన కృష్ణాజిల్లా అధ్యక్షుని బాధ్యతలు అప్పగించాడు. మొత్తానికి ఇంత ఆలస్యంగా మేల్కొన్న జగన్‌ ఇదే వ్యూహాన్ని రాష్ట్రమంతా అనుసరిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement