Advertisement

సుజనాచౌదరికి ఇబ్బంది తప్పదా?

Sat 14th May 2016 11:06 AM
  సుజనాచౌదరికి ఇబ్బంది తప్పదా?
సుజనాచౌదరికి ఇబ్బంది తప్పదా?
Advertisement

ప్రస్తుతం కేంద్రంలో సహాయమంత్రిగా ఉన్న సుజనాచౌదరి రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. దాంతో ఈసారి ఆయనకు మరలా రాజ్యసభ సీటు దక్కుతుందా? లేదా? అనే అంశం అందరికీ ఆసక్తిని కల్పిస్తోంది. వాస్తవానికి 2014వరకు టిడిపిలో సుజనా హవా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఆయనకు సొంత పార్టీ ఎంపీలే శత్రువులుగా మారారు. ఈ విషయంపై ఇప్పటికే వారు సుజనాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చెల్లించలేదనే అంశంపై రేగిన దుమారం ఆయన పరువును తీసింది. కోర్టు వారెంట్‌ జారీ చేయడం కూడా జరిగింది. అంతేకాదు.. ఒకప్పటిలా ఆయనకు యువరాజు నారా లోకేష్‌తో సత్సంబంధాలు కూడా లేవు. దీంతో లోకేష్‌ నుండి సుజనాకు రికమండేషన్‌ రాకపోవచ్చు. మంత్రిగా ఉండి కూడా తమ పార్టీ ఎంపీలనే పట్టించుకోలేదనే ఫిర్యాదుల నేపథ్యంలో సుజనాని ఈసారి కూడా చంద్రబాబు రాజ్యసభకు పంపి ఆయన మంత్రి పదవిని కొనసాగనిస్తారా?లేక పార్టీలోని అత్యధికుల మాట ప్రకారం ఆయనను పక్కనపెడతారా? అనేది వేచిచూడాల్సిన అంశం. సుజనాలాంటి వారిని వెనకేసుకొని.... పార్టీని నమ్ముకున్న వారిని, తమ జీవితాలను పార్టీ కోసం త్యాగం చేసినవారిని వదులుకోవద్దని పార్టీ సీనియర్లు కూడా చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిన్నటివరకు ధీమాగా ఉన్న సుజనాకు ఇప్పుడు ముచ్చెమటలు పోస్తున్నాయట. ఏది ఏమైనా చంద్రబాబు నిర్ణయం ఈ విషయంలో ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు ఎదురుచూడక తప్పదు...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement