పెదనాన్నపై అలిగిన నిహారిక!

Fri 13th May 2016 08:52 PM
niharika,chiranjeevi,oka manasu,oka manasu audio launch  పెదనాన్నపై అలిగిన నిహారిక!
పెదనాన్నపై అలిగిన నిహారిక!
Sponsored links

మెగాబ్రదర్‌ నాగబాబు తనయ నిహారిక 'ఒక మనసు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే. 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌ కాశ్యప్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈచిత్రం ఆడియోను ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అభిమానులు, మెగా ఫ్యామిలీ సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈ ఆడియోను చిరంజీవి చేతుల మీదుగా జరపాలని అందరూ భావించారు. అయితే ఈ విషయంలో చిరు ఎటూ తేల్చడం లేదని సమాచారం. తను తన 150వ చిత్రం విషయంలో బిజీగా ఉన్నానని అందువల్ల రాకపోవచ్చునని అంటున్నాడట. అయితే నిహారిక మాత్రం పెదనాన్న రాకపోతే అసలు ఆడియో వేడుక కూడా ఎందుకు? అని అలిగిందని సమాచారం. దాంతో నాగబాబు చిరుని ఆ వేడుకకు రప్పించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతబిజీగా ఉన్నా ఒక్క పూటైనా వీలు చూసుకొని రావచ్చు కదా..! అని ఈ విషయం తెలిసిన వారు అంటున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్‌తోపాటు బన్నీ, ఇతర మెగా హీరోలు ఈ కార్యక్రమానికి రావడం ఖాయమైంది. ఈ విషయాలన్నీ నిశితంగా పరిశీలిస్తే అసలు మెగా ఫ్యామిలీ నుండి మెగా డాటర్‌గా నిహారిక హీరోయిన్‌గా పరిచయం కావడం చిరుకు ఇష్టం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నిహారిక నటించే ఈ చిత్రం హెల్తీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫీల్‌గుడ్‌ మూవీగా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్‌కి ఏమాత్రం డ్యామేజీ లేకుండా ఇందులోని నిహారిక క్యారెక్టర్‌ ఉంటుందని ఈ చిత్ర దర్శకనిర్మాతలు హామీ ఇస్తున్నారు. ఈ చిత్రం హీరోయిన్‌గా నిహరికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈచిత్రాన్ని మదురశ్రీధర్‌తో పాటు టివి9 సంస్ధ సంయుక్తంగా నిర్మిస్తోంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019