Advertisement

రోశయ్య అవినీతిపరుడా?

Fri 13th May 2016 08:38 PM
konijeti rosaiah,konijeti rosaiah governor,tamilnadu,corruption case,ilamgovan  రోశయ్య అవినీతిపరుడా?
రోశయ్య అవినీతిపరుడా?
Advertisement

కాంగ్రెస్‌ పార్టీలో తను ఉన్నంతకాలం పెద్దమనిషిగా, మృదుస్వభావిగా పేరుతెచ్చుకుని సమైక్యాంద్రకు సీఎంగా చేసి, ప్రస్తుతం మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు గవర్నర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కొణిజేటి రోశయ్య. ఆయన పెద్ద మనిషి కావడంతో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆయనను కదిలించకుండా గవర్నర్‌గానే కొనసాగిస్తోంది. అలాంటి రోశయ్య మీద ఇప్పుడు పెద్ద అపవాదు వచ్చి పడింది. అది కూడా కాంగ్రెస్‌ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఇళంగోవన్‌ ఆయనపై విమర్శలు చేయడం రోశయ్యను బాగా కదిలించి వేసిందట. అందుకోసం ఆయన ఇళంగోవన్‌పై పరువు నష్టం ద్వారా వేసి కోర్టుకి వెళ్లాడు. ఇంతకీ రోశయ్య మీద వచ్చిన ఆరోపణ ఏమిటంటే తమిళనాడుకు చెందిన విశ్వవిద్యాలయాల ఉప కులపతుల ఎంపికలో ఆయన లంచం తీసుకున్నాడనే ఆరోపణను ఇళంగోవన్‌ చేశాడు. వైస్‌ చాన్సిలర్‌ పోస్టులకు గాను రోశయ్య ఒక్కోక్కరి నుండి 15కోట్లు చొప్పున లంచం తీసుకొని దానిలో జయలలితకు 10కోట్లు ఇచ్చి, తాను ఒక్కోక్కరి దగ్గర ఐదుకోట్లు వెనకేసుకున్నాడనేది ఆ ఆరోపణ. నిజానికి రోశయ్య వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మరు. దీంతో బాగా అప్‌సెట్‌ అయిన రోశయ్య ఇళంగోవన్‌పై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement