Advertisementt

శుభం కార్డుకు చేరువలో త్రిష!

Mon 09th May 2016 08:35 PM
trisha,no heroines chances to trisha,trisha movies,nayaki movie  శుభం కార్డుకు చేరువలో త్రిష!
శుభం కార్డుకు చేరువలో త్రిష!
Advertisement
Ads by CJ

చాలా ఏళ్లుగా దాదాపు తెలుగులోని అందరూ స్టార్‌ హీరోల సరసన నటించిన హీరోయిన్‌ త్రిష. కాగా ఇప్పుడు ఆమె కెరీర్‌ చరమాంకానికి చేరింది. దీంతో ఆమెకు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలలో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో కూడా ఏడాది ముందు వరకు మంచి అవకాశాలు వచ్చినా ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయి. దాంతో హీరొయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు, ప్రత్యేక పాత్రలను ఆమె ఒప్పుకుంటోంది. ప్రస్తుతం ఆమె 'నాయకి' చిత్రంతో బిజీగా ఉంది. మరోవైపు ఆమె మాదేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ హర్రర్‌ మూవీలో నటిస్తోంది. ఇవ్వన్నీ లోబడ్జెట్‌ చిత్రాలే కావడం గమనార్హం. ఇక స్టార్‌ హీరో ధనుష్‌ నటిస్తున్న 'కోడి' చిత్రంలో ఆమె పొలిటికల్‌ లీడర్‌గా ఓ పాత్రను చేస్తోంది. మొత్తానికి త్వరలో త్రిష కెరీర్‌కు శుభం కార్డు ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ