Advertisement

గుండమ్మకథ తీయోద్దయ్యో..!

Tue 26th Apr 2016 04:01 PM
gundamma katha,mohan babu,manchu vishnu,raj tarun,gundamma katha remake  గుండమ్మకథ తీయోద్దయ్యో..!
గుండమ్మకథ తీయోద్దయ్యో..!
Advertisement

తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్స్ చిత్రాల్లో గుండమ్మకథ కూడా ఉంది. మహా నటులు అక్కినేని, ఎన్టీఆర్, ఎస్వీఆర్, సూర్యకాంతం, రమణారెడ్డి, సావిత్రి, జమున నట విశ్వరూపానికి ఈ చిత్రం ఉదహరణగా నిలుస్తుంది. గయ్యాలి గంగమ్మగా సూర్యకాంతం తెలుగువారి హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఈ తరం ప్రేక్షకులు కూడా ఈ సినిమా టీవీలో వస్తే అతుక్కుపోతారు. 

కొద్ది సంవత్సరాల క్రితం అంటే నాగార్జున నటుడిగా పరిచయమైన కొత్తలో గుండమ్మ కథ చిత్రాన్ని పునర్మించాలనే ఆలోచన కొందరికి వచ్చింది. అక్కినేని, ఎన్టీఆర్ వారసులు నాగార్జున, బాలకృష్ణ హీరోలుగా నటిస్తారు. నాయికల గురించి పెద్దగా ఇబ్బంది లేకపోయినా సూర్యకాంతం క్యారక్టర్ ఎవరు చేయాలనే విషయంపై సందిగ్దత నెలకొంది. మాటల్లో చేతల్లో గయ్యాలిగా కనిపించాలి. దాదాపు తెలుగు హీరోయిన్లు, క్యారక్టర్ నటుల పేర్లన్నీ పరిశీలించినా ఆ పాత్రకు తగిన తార కనిపించలేదు. దాంతో ఆలోచన స్థాయిలోనే గుండమ్మ కథ పునర్మిర్మాణం ఆగిపోయింది. 

జస్ట్ టూ డేస్ బ్యాక్ మోహన్ బాబు గుండమ్మకథ హక్కులు తీసుకుని మంచు విష్ణు, రాజ్ తరుణ్ తో తీయాలనే ఆలోచన ఉందని వెల్లడించారు. పాత సినిమాలను మళ్లీ తీయాలనుకోవడంలో తప్పులేదు. కానీ కొన్ని క్లాసిక్స్ జోలికి వెళ్లకుంటేనే మంచిది. పైగా పాత సినిమా స్థాయిలోనే కొత్త సినిమాను చూస్తారు. దాంతో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. తేలిపోతుంది. కమర్షియాలిటీ పేరుతో అతి చూపిస్తే విమర్శలపాలవుతారు. పైగా సూర్యకాంతం క్యారక్టర్ చేయడానికి ఆర్టిస్టే దొరకని పరిస్థితి. 

మోహన్ బాబు గురువు దాసరి నారాయణరావు గతంలో ఒక ప్రయోగం చేశారు. వందేళ్ళ సినిమా చరిత్రలోనే అత్యత్తుమ క్యాసిక్ గా నెంబవర్ వన్ స్థానం పొందిన మాయాబజార్ చిత్రాన్ని సాంఘికం చేసే ప్రయత్నం చేశారు. అలనాటి ఆణిముత్యం లాంటి మాయాబజార్ ను అక్కినేని, సుమన్, దాసరి వంటి ఆర్టిస్టులతో సోషలైజ్ చేస్తే అదికాస్త బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. 

క్లాసికల్ చిత్రాలను పునర్మించే ఆలోచన సరికాదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ చిత్రాలను మళ్లీ మళ్ళీ తీసినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాబట్టి మోహన్ బాబు తన ఆలోచనను మరోసారి ఆలోచించుకుంటే మంచిది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement