Advertisement

నాకు మాస్ సినిమాలంటే ఇష్టం: బన్నీ

Tue 26th Apr 2016 04:03 PM
sarainodu success meet,allu arjun,boyapati sreenu,allu aravind  నాకు మాస్ సినిమాలంటే ఇష్టం: బన్నీ
నాకు మాస్ సినిమాలంటే ఇష్టం: బన్నీ
Advertisement

అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం 'సరైనోడు'. బోయపాటి శ్రీను దర్శకుడు. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్ లోని ఆవాస హోటల్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''సినిమాకు ప్రాణం పోసిన టెక్నీషియన్స్ అందరికి నా థాంక్స్. శ్రీకాంత్ గారు లేకుండా ఈ సినిమాను ఊహించలేను. రకుల్, కేథరిన్ లు మంచి కథానాయికలు. కేథరిన్ ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ చూపించేది. తను అనుకున్నట్లుగానే సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా చేసేప్పుడు నాకొక గోల్ ఉండేది. నేను ఆ గోల్ ను అచ్చీవ్ అయ్యాను. నాకు మాస్ సినిమాలంటే చాలా ఇష్టం. నేను ఈ సినిమా చేయడానికి ఒకే ఒక్క కారణం బోయపాటి గారు. ఆయన నన్ను మాసివ్ లుక్ లో చూపిస్తారని చేశాను. హీరోకు మంచి పేరొస్తే దానికి కారణం డైరెక్టర్ గారే. ఈరోజు నా రోల్ కు మంచి రెస్పాన్స్ వస్తోందంటే దానికి కారణం బోయపాటి గారే. అల్లు అరవింద్ నా తండ్రైనా.. మొదటగా ఆయనొక ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమాను ఎంతో ప్రేమిస్తారు. నేను, తమ్ముడు, నాన్న కలిసి వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం.. దాని పేరు 'వి లవ్ సినిమా'. చిరంజీవి గారి కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ చేసిన సినిమా నాన్నగారు నిర్మించినదే.. అలానే పవన్ కళ్యాన్ గారు చేసిన జల్సా సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్.. అలానే చరణ్ తో చేసిన మగధీర బాక్సాఫీస్ రికార్డ్స్ ను తిరగరాసింది. ఇలా ఎందరో హీరోల కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. నాకొక పిచ్చి ఉంది. నేను చేసిన సినిమా ఫ్లాప్ అయినా పర్లేదు కానీ.. చూడడానికి మాత్రం బావుండాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హిట్ కొట్టాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. బద్రినాథ్ తో హిట్ కొట్టాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు. ఇప్పుడు సరైన సినిమా పడింది. నేను గీతా ఆర్ట్స్ లో హిట్ కొట్టాను'' అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''బన్నీ పది సంవత్సరాల కెరీర్ లో రకరకాల పాత్రలు చేశాడు. ఒకసారి నా దగ్గరకు వచ్చి 'నాన్నా మాస్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే సినిమా చేయాలనుందని అడిగాడు'. బోయపాటి మాత్రమే అలాంటి సినిమా చేయగలడని ఆయనను కలిశాను. బోయపాటి ఆరు నెలలు వర్క్ చేసి స్క్రిప్ట్ రెడీ చేశాడు. యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా కథ రాయడం కష్టమైన పని. బోయపాటి బన్నీకు సూట్ అయ్యే కథను రెడీ చేసి సినిమా మొదలుపెట్టాడు. బోయపాటి మీద నమ్మకంతోనే సినిమా కోసం బాగా ఖర్చుపెట్టాను. తను ఎప్పుడు సినిమాల గురించే ఆలోచిస్తుంటాడు. ఎంతో ప్యాషన్ తో వర్క్ చేస్తాడు. ఆదివారం నాటికి థియేటర్ల సంఖ్యను పెంచాం. బోయపాటి, బన్నీల కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ సినిమా ఇదే'' అని చెప్పారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ''నేను చేసే ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావించి చేస్తాను. లెజెండ్ సినిమా చేసిన తరువాత మంచి స్క్రిప్ట్ తో సినిమా చేయాలని ఎదురుచూసి బన్నీతో సినిమా చేశాను. పాత్రలకు న్యాయం చేసే వారిని ఎన్నుకొని సినిమా చేశా.. శ్రీకాంత్ తన క్యారెక్టర్ తో సినిమాకు ప్రాణం పోశారు. ఆది సినిమాకు ఉపయోగపడాలి.. సినిమా తనకు ఉపయోగపడాలని జాగ్రత్తగా సినిమా చేశాను. నా మీద నమ్మకంతో ఇంత ఖర్చు పెట్టిన అల్లు అరవింద్ గారికి నన్ను నమ్మిన బన్నీకి థాంక్స్. ప్రివ్యూ చూసిన చిరంజీవి గారు సినిమాను ఇరగాదీసావ్ బోయపాటి అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. నా జీవితంలో బెస్ట్ కాంప్లిమెంట్ అది'' అని చెప్పారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ''ఈ సినిమాను బ్లాక్ బాస్టర్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్. నాకు ఈ సినిమాకు వచ్చిన ఫోన్ కాల్స్ మరే నిమాకు రాలేదు. బోయపాటి గారు చెప్పిన దానికి కేవలం నలభై శాతం మాత్రమే నేను చేశాను. తొంబై శాతం చేసి ఉంటే అవార్డ్స్ వచ్చేవేమో.. బన్నీ నన్ను ఎంతో ప్రోత్సహించాడు. హెల్థీ కాంపిటిషన్ ఉండేది'' అని చెప్పారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''బన్నీతో వర్క్ చేయాలనేది నా కోరిక. ఈ సినిమా రాగానే కథ కూడా వినకుండా ఓకే చెప్పేసాను. నా కెరీర్ కు ఈ సినిమా ఉపయోగపడుతుందా .. లేదా అని కూడా ఆలోచించలేదు. బోయపాటి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీకు కావాలి. స్టైలిష్ స్టార్ బన్నీకు స్టైలిష్ విలన్ దొరికాడు. బన్నీ సెంటిమెంట్ సీన్స్ లో కూడా అధ్బుతంగా నటించాడు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సాయి కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్, రామ్ లక్ష్మణ్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement