Advertisementt

రాజ్‌తరుణ్‌కు వరుస చిత్రాలు...!

Wed 16th Mar 2016 12:20 PM
raj tarun,sarainodu,vamsi,dil raju,geetha arts  రాజ్‌తరుణ్‌కు వరుస చిత్రాలు...!
రాజ్‌తరుణ్‌కు వరుస చిత్రాలు...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రాజ్‌తరణ్‌ మంచు విష్ణుతో కలిసి ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'వీడు అదో టైప్‌.. వాడు మరో టైప్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బడా బడా సినిమాల మధ్య ఏప్రిల్‌14న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇటు ఏప్రిల్‌ 8న పవన్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌', ఏప్రిల్‌ 22న బన్నీ 'సరైనోడు' చిత్రాలు విడుదలవుతున్న సమయంలో 'సర్దార్‌'కు వారం తర్వాత, బన్నీ 'సరైనోడు' కి వారం రోజుల ముందు ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారని, మెగాహీరోల మధ్య విష్ణు, రాజ్‌తరుణ్‌లు నలిగిపోతారనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే ఏప్రిల్‌ 14న ఈ చిత్రంతో పాటు తమిళస్టార్‌ సూర్య హీరోగా 'మనం' దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ తీస్తున్న '24' చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో విష్ణు చిత్రం ఆ పోటీని తట్టుకోగలదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ చిత్రం తర్వాత రాజ్‌తరుణ్‌ సీనియర్‌ వంశీ డైరెక్షన్‌లో ఓ చిత్రం, దిల్‌రాజు కొత్త దర్శకునితో చేయబోయే చిత్రం, మారుతి కథతో గీతాఆర్ట్స్‌ నిర్మించే చిత్రాలకు కమిట్‌ అయ్యాడు. మరి ఇందులో ఏది ముందుగా మొదలవుతుందనే విషయం మాత్రం అర్థం కావడంలేదు దీనిపై త్వరలో రాజ్‌తరుణ్‌ అధికారికంగా స్పందించి, తన సినిమాలను ప్రకటిస్తాడని తెలుస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ