Advertisementt

'ఓ స్త్రీ రేపు రా' మూవీ సక్సెస్ మీట్!

Wed 16th Mar 2016 12:35 PM
o stree repuraa movie,vamsikrishna,manali rathod  'ఓ స్త్రీ రేపు రా' మూవీ సక్సెస్ మీట్!
'ఓ స్త్రీ రేపు రా' మూవీ సక్సెస్ మీట్!
Advertisement
Ads by CJ

ఆశిష్ గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శ్రుతి మోల్, మనాలి ప్రథాన పాత్రల్లో రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. మార్చి 11న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. '''ఓ స్త్రీ రేపురా' అని గోడ మీద రాస్తే దయ్యం వెళ్ళిపోతుందని అందరూ భావించేవారు. ఇదే కాన్సెప్ట్ తీసుకొని సినిమా చేశాం. చాలా రిసెర్చ్ చేశాం. మార్చి 11న విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎనభై శాతం కలెక్షన్స్ తో సినిమా రన్ అవుతోంది. థియేటర్ల సంఖ్య కూడా పెంచాం. సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

మనాలి రాథోడ్ మాట్లాడుతూ.. ''సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కల్యాణి అనే పాత్రలో నటించాను. నా పాత్రకు కూడా మంచి పేరొచ్చింది'' అని చెప్పారు.

వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ''సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. థియేటర్స్ కూడా పెరిగాయి. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేస్తోన్న ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: జి.వి, ఎడిటర్: రామాంజనేయ రెడ్డి, కెమెరా: సిద్ధం మనోహర్, దేవర హరినాథ్, సాహిత్యం: సుభాష్ నారాయణ్, పవన్ రాచేపల్లి, స్క్రిప్ట్, డైలాగ్స్: పవన్ రాచేపల్లి, కో ప్రొడ్యూసర్: ప్రవీణ్ సాగి, కథ, నిర్మాత, దర్శకత్వం: అశోక్ రెడ్డి. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ