Advertisement

మాటలతో గెలిచేస్తున్న పవన కళ్యాణ్!

Tue 08th Mar 2016 03:37 PM
pawan kalyan,anupama chopra interview  మాటలతో గెలిచేస్తున్న పవన కళ్యాణ్!
మాటలతో గెలిచేస్తున్న పవన కళ్యాణ్!
Advertisement

సినిమాల్లో పేల్చే మాటల తూటాల కన్నా, రాజకీయంగా ముచ్చటించే విషయాల కన్నా పవన్ కళ్యాణ్ తన సహజ శైలిని ఎక్కువగా పర్సనల్ ముఖాముఖీ ఇంటర్-వ్యూలలోనే ఓపెన్ చేస్తారు. గత మూడు రోజులుగా అనుపమతో పవన్ కళ్యాణ్ ఇంటర్-వ్యూ అనే ట్యాగ్ పేరుతో సోషల్ మీడియా మొత్తం వేడెక్కి పోయింది. అందరూ అనుకున్నట్లుగానే సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సెట్లో పవన్, అనుపమలు ఎన్నో విషయాలు ముచ్చటించారు. తన సినీ, రాజకీయ జీవితం గురించి పాత విషయాలనే అయినా కొత్తగా ఆవిష్కరించిన పవన్ మరోసారి స్వచ్చమైన మనసుతో, పొందికైన మాటలతో అందరి మనసులనూ గెలిచేసుకున్నాడు. ఇంకొన్నేళ్ళ తరువాత నటుడిగా తన ఇన్నింగ్స్ గుడ్ బై చెప్పేసి రచయితగా స్థిరపడిపోతానని, షూటింగ్ లేని ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదివేస్తూ గెడ్డాలు పెంచేసుకుంటానని, రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వచ్చే ముందు సినిమాలను వదిలేస్తానని, ఎక్కడైనా తన అంతరాత్మ భోదించినట్టుగానే నడుచుకుంటానని... అలా చాలా విషయాల పైన పూర్తి అవగాహనతో మాట్లాడారు. సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజయి, సూపర్ హిట్టయి, మరోసారి పవన్ పేరు ప్రఖ్యాతలు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగాలని అందరిలాగానే మనమూ కోరుకుందాం.


Loading..
Loading..
Loading..
advertisement