Advertisementt



సిక్స్‌ప్యాక్ చూపిస్తే 10కోట్లు ఇస్తారా?

Tue 08th Mar 2016 12:07 PM
raviteja,six pack,remuneration,raviteja six pack story  సిక్స్‌ప్యాక్ చూపిస్తే 10కోట్లు ఇస్తారా?
సిక్స్‌ప్యాక్ చూపిస్తే 10కోట్లు ఇస్తారా?
Advertisement
Ads by CJ

ఐదు పదుల వయసులో రవితేజ చూపించబోయే సిక్స్‌ప్యాక్ వెనుక మాంఛి కమర్షియల్ సిక్రెట్ దాగుందని అంటున్నారు ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఇటీవల తన సిక్స్‌ప్యాక్‌కు సంబంధించిన ఫోటోలను లీక్ చేసి అందరి దృష్టిలో పడ్డాడు రవితేజ. అయితే గత కొంతకాలంగా డైట్ పాటించడం వల్ల అతని శరీరంలో వచ్చిన మార్పుల వల్ల కాస్త సన్నబడి.. ఫేస్‌లో గ్లో మిస్ చేసుకున్నాడు ఈ క్రేజీ మాస్‌హీరో.. దీనికి తోడు ఫ్లాప్‌లు కూడా జతకావడంతో.. ఇక రవితేజ పని అయిపోయిందనే పుకార్లు వినిపించాయి.. కిక్-2 డిజాస్టర్ కావడం.. ‘బెంగాల్ టైగర్’ బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ సాధించే కంటెంట్ వున్న.. రవితేజలో మునుపటి ఎనర్జీ లేకపోవడంతో...ఆ ఛాన్స్ మిస్ అయ్యిందనే కామెంట్స్ వినిపించడం, పారితోషికం తగ్గించమని నిర్మాతలు డిమాండ్ చేయడం.. ఇలా అన్నీ రకాల సమస్యలు రవితేజను కలవరపరిచాయి. అందుకే మళ్ళీ తను కుర్రహీరోలకు ఏమీ తీసిపోనని నిరూపించుకోవాలనే కసితో.. రవితేజ సిక్స్‌ప్యాక్ చేసి తను అన్ని విధాలా ఫిట్‌గానే వున్నానని ఫ్రూవ్ చేసుకున్నాడు. అయితే ఇదంతా తన మార్కెట్ పడిపోయిందని.. పారితోషికం తగ్గించమని అడిగే నిర్మాతల కోసమే అనేది టాలీవుడ్ టాక్. రవితేజ సిక్స్‌ప్యాక్ చేసినంత మాత్రానా.. మార్కెట్ రేంజ్ ఆలోచించకుండా తన మునుపటి పారితోషికం పది కోట్లు  నిర్మాతలు ఇచ్చేస్తారా?..చూడాలి..మరి!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ