రేష్మి..మరీ ఈ రేంజ్ లోనా!

రేష్మి... టీవీ ప్రోగామ్స్‌ మరీ ముఖ్యంగా 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌' చూసే వారికి ఆమె చిరపరిచితం. కాగా ఈ షోలోనే తన అందాలతో కట్టిపడేస్తున్న రేష్మి... ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించనున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల విడుదలైన 'గుంటూర్‌ టాకీస్‌' ట్రైలర్‌ చూసిన వారికి రేష్మి ఏ రేంజ్‌లో అందాలను ఆరపరిచిందో అర్థం అవుతుంది. 'చందమామ కథలు' చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్‌సత్తార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 'జబర్దస్‌' ద్వారా పేరు తెచ్చుకున్న అనసూమ, 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రేష్మి ఇద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిని మన తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారో కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. మొత్తానికి కేవలం బుల్లితెర తారలుగానే గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు అసలు సినిమా ఫీల్డ్‌లో ఎలా నెగ్గుకోస్తారో వేచిచూడాల్సివుంది! ప్రస్తుతానికైతే  రేష్మి 'గుంటూర్‌ టాకీస్‌' లో రెచ్చిపోయిన దాని గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.

rashmi gautham
guntur talkies
anasuya
jabardasth
rashmi exposing in guntur talkies
Advertisement
Advertisement