Advertisementt

బాలయ్య బాలయ్య... ధియేటర్లో గోలయ్యా!

Sat 13th Feb 2016 04:51 PM
krishna gaadi veera prema gaadha,nani,balakrishna fans  బాలయ్య బాలయ్య... ధియేటర్లో గోలయ్యా!
బాలయ్య బాలయ్య... ధియేటర్లో గోలయ్యా!
Advertisement
Ads by CJ

బాలయ్య పేరు వింటేనే రాయలసీమలో రికార్డులు బద్దలవుతాయి. నందమూరి హీరోలకు ఆ ఏరియాలో ఉన్న ఫాలోయింగ్ అటువంటిది మరి. బాలకృష్ణతో సినిమా తీస్తేనే ఇక్కడి జనాలు చూస్తారా అంటే అబ్బే అదేం కాదు, బాలయ్య బాబు పేరు గానీ, బొమ్మ గానీ తెర మీద అగుపిస్తే చాలు వీరి ఆనందానికి అవధులుండవు. కావాలంటే ఈ లాజిక్కుతో మ్యాజిక్కు చేసిన దర్శకుడు హను రాఘవపుడి కొత్త చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాధను తిలకించండి. హీరో నాని ఈ సినిమాలో బాలయ్య బాబు ఫ్యాన్ కావడం, చేతి మీద జై బాలయ్య అన్న పచ్చబొట్టు పొడిపించుకోవడం, సమయం చూసి లెజెండ్ పోస్టర్ అతికించేసి బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తే యాక్షన్ సీన్లు వేయడం... అన్నీ వెరసి నాని సినిమాకు బాలకృష్ణ అభిమానులు క్యూలు కట్టేస్తున్నారు. ఇక ధియేటర్లో అయితే ఈ దృశ్యాలు కదలాడినంత సేపు నందమూరి ఫ్యాన్స్ గోల మామూలుగా ఉండటం లేదంట. ఓ సినిమాను కమర్షియల్ హిట్ చేసుకోవాలంటే దాన్ని ఫార్ములా ప్రకారమే వండాలి. ఈ వండే పద్దతిని బాగా ఆకళింపు చేసుకున్న 14 రీల్స్ సంస్థ వారు లెజెండ్ చిత్రం తరువాత బాలకృష్ణ ఇమేజిని వాడుకోవడంలో నాని సినిమాతో మరోసారి సఫలమయ్యారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ