Advertisementt

విమర్శకులకు సమాధానం చెప్పే పనిలో చరణ్‌..!

Sat 13th Feb 2016 04:18 PM
ram charan,thani oruvan movie,surendar reddy  విమర్శకులకు సమాధానం చెప్పే పనిలో చరణ్‌..!
విమర్శకులకు సమాధానం చెప్పే పనిలో చరణ్‌..!
Advertisement
Ads by CJ

గత రెండేళ్ల ముందు వరకు రామ్‌చరణ్‌ జోరు బాగానే సాగింది. మెగాస్టార్‌ చిరంజీవి తనయుడుడిగా, మెగాహీరోగా ఆయన చేసిన చిత్రాలు కమర్షియల్‌గా బాగానే వర్కౌట్‌ అయ్యాయి. అయితే గత రెండేళ్లుగా మాత్రం ఆయన కెరీర్‌ అనుకున్న స్థాయిలో సాగడం లేదు. మూసచిత్రాలతో ప్రేక్షకులకు మాత్రమే కాదు... అభిమానులను కూడా ఆయన నిరాశపరుస్తున్నాడు. దాంతో తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే పనిలో చరణ్‌ ముందడుగు వేస్తున్నాడు. తాజాగా ఆయన తమిళ 'తని ఒరువన్‌' రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మామూలు రొటీన్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ కాదు. ఓ పోలీస్‌ ఆఫీసర్‌కు, బిజినెస్‌మేన్‌కు మద్య జరిగే మైండ్‌ గేమ్‌. ఈ చిత్రంతో ఆయన సరికొత్త కోణంలో ఈ చిత్రంలో కనిపించాలని ప్లాన్‌ చేసుకుంటున్నాడు.ఒరిజినల్‌ స్టోరీలో మార్పులు చేర్పులు చేయకుండా తమిళ సినిమాలానే ఈ రీమేక్‌ కూడా అదే పంధాలో కొనసాగాలా చూడాలని ఆయన తన దర్శకుడు సురేందర్‌రెడ్డికి గట్టిగానే సూచించాడు.ఈ చిత్రం తర్వాత ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇదో రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. సుక్కు సినిమా అంటేనే అది మామూలు సినిమాలకు విభిన్నంగా సాగుతుందనేది అందరికీ తెలిసిందే. అందుకే ఆయన సుక్కుతో ఓ విభిన్నమైన క్లాస్‌ మూవీకి శ్రీకారం చుట్టనున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇది మెసేజ్‌ ఓరియంటెడ్‌గా సాగే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగనుందని సమాచారం. ఇలా ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పిన చరణ్‌ తనపై వస్తున్న విమర్శలకు ఇప్పుడు సరైన సమాధానం ఇచ్చే పనిలో నిమగ్నమైవున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ