Advertisementt

నితిన్ కు కూడా శైలజను ఇస్తాడా..?

Sat 06th Feb 2016 05:13 PM
nithin,kishore tirumala,nikitha reddy,trivikram  నితిన్ కు కూడా శైలజను ఇస్తాడా..?
నితిన్ కు కూడా శైలజను ఇస్తాడా..?
Advertisement
Ads by CJ

'ఇష్క్','గుండెజారి గల్లంతయ్యిందే', 'హార్ట్ ఎటాక్' చిత్రాలతో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న నటుడు నితిన్. లేటెస్ట్ గా రామ్ హీరోగా 'నేను శైలజ' వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రూపొందించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు కిషోర్ తిరుమల. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో మంచి చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నితిన్ తో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన  శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అ ఆ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం కిషోర్ తిరుమల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ