Advertisementt

'బాహుబలి2'నా.. మజాకా..!

Sat 06th Feb 2016 04:40 PM
bahubali1,bahubali part 2,rajamouli,bollywood remake  'బాహుబలి2'నా.. మజాకా..!
'బాహుబలి2'నా.. మజాకా..!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న 'బాహుబలి1' చిత్రం అమోఘమైన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కూడా కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోకి ఈ చిత్రం అనువాదమై 100కోట్లకు పైగానే కొల్లగొట్టింది. దాంతో ఇప్పుడు 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' చిత్రానికి దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కాగా బాలీవుడ్‌కు చెందిన ఓ పెద్ద డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఈ చిత్రం బాలీవుడ్‌ అనువాద హక్కులను ఏకంగా 150 కోట్లకు ఆఫర్‌ చేసిందని సమాచారం. అయితే ఈ డీల్‌ ఇంకా ఓకే కాలేదు. ఈ చిత్ర నిర్మాతలతో పాటు రాజమౌళి సైతం 'బాహుబలి1'ను ఇచ్చిన కరణ్‌జోహార్‌కే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని సమాచారం,. కాగా ఇప్పుడే ఇన్ని సంచలనాలకు కారణమైన 'బాహుబలి2' విడుదలైన తర్వాత మరెంతటి సంచలనాలను సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ