Advertisementt

రకుల్‌ గురించి ఇప్పుడు రాస్తున్నారంట!

Thu 28th Jan 2016 11:56 AM
rakul preet singh,remuneration,nannaku prematho,rakul preet singh remuneration hike  రకుల్‌ గురించి ఇప్పుడు రాస్తున్నారంట!
రకుల్‌ గురించి ఇప్పుడు రాస్తున్నారంట!
Advertisement

ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న హీరోయిన్‌ ఎవరు అంటే అందరూ ఠక్కున రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేరు చెబుతారు. రీసెంట్‌గా ఆమె ఎన్టీఆర్‌ సరసన నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో ఆమె మరింత బిజీ అయింది. ఇప్పుడు అందరూ స్టార్స్‌ తమ సినిమాల్లో ఆమె కావాలని కోరుకుంటున్నారు. దీంతో రకుల్‌ తన రెమ్యూనరేషన్‌ను ఈ చిత్రం తర్వాత మరింత పెంచింది. తాజాగా ఇదే రెమ్యూనరేషన్‌ విషయం మీడియా ఆమె ముందు ప్రస్తావించింది. దీనికి సమాధానంగా ఆమె నేను తొలిరోజుల్లో కేవలం నాలుగైదు లక్షలతోనే సరిపుచ్చుకుని సినిమాలు చేసినప్పుడు మీడియాలో ఎవ్వరూ ఇంత తక్కువ రేటుకు పనిచేస్తోందే అని అడగలేదు. ఇప్పుడు మాత్రం రెమ్యూనరేషన్‌ పెంచానని, ఎక్కువ తీసుకుంటున్నానని వార్తలను రాస్తున్నారు. అయినా సినిమా రేంజ్‌ను బట్టి, డిమాండ్‌ను బట్టి ఎవ్వరికీ కష్టం కలగకుండా పనిచేస్తున్నంతకాలం నాకేమీ ఫర్వాలేదు. సినిమా రేంజ్‌ను బట్టే అది కూడా నిర్మాతలకు భారం అనిపించకుండా  నా రెమ్యూనరేషన్‌ పెంచాను తప్పితే ఎవ్వరినీ ఈ విషయంలో నేను ఇబ్బంది పెట్టడం లేదు అని సెలవిచ్చింది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement