Advertisementt

రజనీది కాదు.. అజిత్‌దే హవా!

Thu 28th Jan 2016 11:34 AM
rajinikanth,ajith,survey,vijay,kamal haasan,ajith top place  రజనీది కాదు.. అజిత్‌దే హవా!
రజనీది కాదు.. అజిత్‌దే హవా!
Advertisement
Ads by CJ

ఇటీవల కాలంలో సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. 'కొచ్చాడయాన్‌, లింగా' చిత్రాలు ప్రేక్షకులనే కాదు... అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. కాగా ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కంటే అజిత్‌కే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంది అన్న విషయం తేటతెల్లమైంది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విషయంలో వరుసగా నాలుగు సూపర్‌హిట్లు కొట్టిన అజిత్‌.. రజనీ కంటే ముందున్నాడు. ఈ సర్వేలో 16.2 శాతం ఓట్లతో అజిత్‌ మొదటి స్థానంలో నిలవగా, 15.8 శాతం ఓట్లతో రజనీకాంత్‌ రెండో స్థానంలో ఉన్నాడని ఆ సర్వేలో తేలింది. ఇక 9.9శాతం ఓట్లతో యంగ్‌స్టార్‌ విజయ్‌ మూడో స్థానం దక్కించుకోగా, 5.2 శాతం ఓట్లతో కమల్‌ ఆ తదుపరి స్థానం దక్కించుకున్నాడు. ఇక 4.3 శాతం ఓట్లతో సూర్య ఐదవ స్థానం పొందాడు. మొత్తానికి ఇప్పుడు కోలీవుడ్‌లో రజనీకాంత్‌ స్థానానికి ఎసరుపెట్టే క్రేజ్‌ ఫాలోయింగ్‌ కేవలం అజిత్‌కే వుందని అక్కడి సినీ విశ్లేషకులు కూడా ఒప్పుకొంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ