Advertisementt

నాన్నకు ప్రేమతో, అదొక్కటే కలిసొస్తుంది

Sat 09th Jan 2016 11:41 PM
nannaku prematho,jr ntr,dictator  నాన్నకు ప్రేమతో, అదొక్కటే కలిసొస్తుంది
నాన్నకు ప్రేమతో, అదొక్కటే కలిసొస్తుంది
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఏ నలుగురు కలిసి బాతాఖానీ మొదలెట్టినా సంక్రాంతికి రానున్న ఆ నాలుగు పెద్ద సినిమాల మధ్య పోటీ గురించే మాట్లాడుకుంటున్నారు. మొదటగా జూనియర్ ఎన్టీయార్ నాన్నకు ప్రేమతోతోనే 13న యుద్ధం మొదలు కానుంది. అటు తరువాత డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజాలు 14న, ఇక 15న సోగ్గాడే చిన్ని నాయన అడుగుపెట్టబోతున్నాయి. బాలకృష్ణ ధాటికి జూనియర్ ఎన్టీయార్ సినిమాకి కావాల్సినన్ని థియేటర్స్ దొరకడం కష్టం అయిందన్న వాదన ఇంకా కొనసాగుతున్నా, అన్ని సినిమాల కన్నా ముందుగా తారక్ రావడమే ఇక్కడ బాగా కలిసొచ్చే అంశం అయింది. నేను శైలజ తరువాత బాక్సాఫీస్ దగ్గర డ్రై స్పెల్ కంటిన్యూ అవుతోంది. కాబట్టి 13న రానున్న నాన్నకు ప్రేమతోకు రిలీజ్ థియేటర్స్ విషయంలో అడ్డు ఉండబోదు. కానీ ఈ ఆనందం ఒక్క రోజే. ఎందుకంటే రెండో రోజు నుండి ఈ హాల్స్ అన్నీ డిక్టేటర్ కోసం బ్లాక్ అవుతున్నాయి. ఈ లెక్కన చూస్తే తారక్ దెబ్బకు ఫస్ట్ డే షేర్స్ రికార్డులు అన్నీ బద్దలయ్యే సూచనలు ఉన్నాయి. తంటా అంతా రెండో రోజు నుండే మొదలవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని B, C, D సెంటర్లలో నాన్నకు ప్రేమతో కోసం బుక్ చేసిన పెద్ద పెద్ద హాల్సులో సింహభాగం రెండో రోజు నుండే డిక్టేటర్ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి. మరి తారక్ అభిమానుల ఆనందం ఒక్క రోజులోనే ఆవిరవుతుందా లేక ఆఖరి నిమిషంలో ఏవైనా సర్దుబాట్లు జరుగుతాయా అన్నది ఆ క్షణం వరకూ తేలని సస్పెన్స్.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ