Advertisement

హీరోలందరివి పైపై నాటకాలే..!

Sat 09th Jan 2016 01:12 PM
industry star heroes,cold war,bahubali,srimanthudu  హీరోలందరివి పైపై నాటకాలే..!
హీరోలందరివి పైపై నాటకాలే..!
Advertisement

చూడటానికి, వినడానికి మన స్టార్‌హీరోల మాటలు ఎంతో తియ్యగా ఉంటాయి. అందరం కలిసే ఉన్నాం.. అంటూనే ఉంటారు. కానీ వారి మధ్య కోల్డ్‌వార్‌ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఫామ్‌హౌస్‌లలో అందరూ కలిసి ఒకరిపై ఒకరి సినిమాలు పోటీపడకూడదని, ఒక్కో చిత్రానికి కనీసం వారం, రెండు వారాల గ్యాప్‌ తీసుకోవాలని నిర్ణయాలైతే తీసుకున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది తుస్సుమంటోంది. ఇండస్ట్రీలో స్టార్‌ హీరోల మధ్య కనిపించని యుద్దం నడుస్తూనే ఉంటుంది. ఒకేసారి రెండు భారీ చిత్రాలు విడుదలైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుంది? అనే విషయం ఇటీవలే బాలీవుడ్‌ చిత్రాలైన 'దిల్‌వాలే, భాజీరావ్‌మస్తానీ' చిత్రాలతో అర్థం అయింది. ఒకేసారి విడుదల కావడం వల్ల రెండు చిత్రాలూ బాగా లాస్‌ అయ్యాయి. అదే గ్యాప్‌ తీసుకొని వస్తే ఎలా ఉంటుంది? అనే విషయాన్ని 'బాహుబలి, శ్రీమంతుడు' చిత్రాలు నిరూపించాయి. కానీ అవి మన స్టార్స్‌ కళ్లకు కనపడవు... చెవులకు వినపడవు. ఒకేసారి వస్తే థియేటర్ల ప్రాబ్లమ్‌ మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ సంక్రాంతికి వరుసగా మూడు రోజుల్లో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. దీని వల్ల స్టార్స్‌కు ఏమీ కాదు... నష్టపోయేదంతా నిర్మాతలే అని చెప్పవచ్చు. తాత్కాలిక ఆవేశంలో పంతాలకు పోయి మన స్టార్స్‌ తీసుకునే నిర్ణయాలు నిర్మాతలకు తలబొప్పి కట్టిస్తున్నాయి. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతల బాగోగులు మన స్టార్స్‌కు పట్టవు. చివరికి వీరు నిర్మాతలను బలిపశువులను చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలకాబోయే నాలుగుచిత్రాలకు ఇండస్ట్రీలో, ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ అయితే ఉంది. అదే గ్యాప్‌ తీసుకుని వస్తే నాలుగు చిత్రాలకు అద్భుతమైన కలెక్షన్లు, ఓపెనింగ్స్‌ వస్తాయి. కానీ మన హీరోలు ఎవ్వరి మాట వినడం లేదు. సినిమాలు బాగుంటే సంక్రాంతి వంటి సీజన్‌లో ఎన్ని వచ్చినా ఇబ్బందిలేదు అనేది కొందరి వాదన.కానీ అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమాల కలెక్షన్లను మొదటివారం వసూళ్లే శాసిస్తున్నాయి. కానీ ఈ విషయం మాత్రం తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారు మన హీరోలు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement