Advertisementt

కామెడీని నమ్ముకున్న నాగ్‌..!

Sat 09th Jan 2016 01:07 PM
nagarjuna,soggade chinni nayana,comedy jonar,ramyakrishna  కామెడీని నమ్ముకున్న నాగ్‌..!
కామెడీని నమ్ముకున్న నాగ్‌..!
Advertisement
Ads by CJ

నవ్వే.. నవ్వు... రెండున్నర గంటల సేపు ప్రేక్షకులను నవ్విస్తే ఇక ఆ సినిమాకు తిరుగుండదనేది నేటి ట్రెండ్‌లో అక్షరసత్యం. కామెడీ అనేది ఎవర్‌గ్రీన్‌ అని అందరి అభిప్రాయం. అందుకే ఈసారి భారీ చిత్రాల నడుమ వస్తున్న నాగార్జున కామెడీతోనే ప్రేక్షకుల వీక్‌నెస్‌పై కొడుతున్నాడు. ఆయన చేస్తున్న 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగ్‌ ప్రొజెక్ట్‌ చేస్తున్నాడు. టీజర్లు, ట్రైలర్ల నిండా కామెడీనే నమ్ముకొని ఆయుధంలా వాడుతున్నాడన్న సంగతి అర్థం అవుతోంది. 'హలోబ్రదర్‌, మన్మథుడు' వంటి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని నాగ్‌ మరోసారి కామెడీ అస్త్రాన్ని సంధిస్తున్నాడు. నవ్విస్తే హిట్‌ కొట్టడం గ్యారంటీ అనేది ఈ పోటీలోకి నాగ్‌ ఎంటర్‌కావడానికి మెయిన్‌ కారణంగా అందరూ భావిస్తున్నారు. ట్రైలర్స్‌ అన్నింటినీ దర్శకనిర్మాతలు కామెడీతో నింపేస్తున్నారు. టీజర్లు, ట్రైలర్స్‌తోనే ప్రేక్షకుల మైండ్‌ సెట్‌ను సెట్‌ చేసే పనిలో నాగ్‌ బిజీగా ఉన్నాడు. సో.. మరి మన సోగ్గాడు ఇందులో ఎంత వరకు విజయం సాధిస్తాడో? మిగిలిన భారీ మాస్‌ అండ్‌ యాక్షన్‌ చిత్రాలను ఎలా ఎదుర్కొంటాడు? కామెడీతో ఏమాత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తాడు? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి, హంసానందిని, అనసూయ వంటి ముద్దుగుమ్మలతో మన సోగ్గాడు ఎలా కనిపించబోతున్నాడు? అనేది వేచిచూడాలి...! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ