ఒకే దారిలో చిరు, బాలయ్య..!

Fri 08th Jan 2016 08:57 AM
chiranjeevi,katthi movie,balakrishna,dictator movie  ఒకే దారిలో చిరు, బాలయ్య..!
ఒకే దారిలో చిరు, బాలయ్య..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో నిన్నటివరకు టాప్‌1,2 స్థానాల్లో ఉన్న సూపర్‌స్టార్స్‌ చిరంజీవి, బాలకృష్ణ. వీరిద్దరికీ ఉన్న మాస్‌ ఇమేజ్‌ అంతా ఇంతాకాదు. కాగా వారిద్దరూ ఇప్పుడు తమ తమ మైల్‌స్టోన్‌ సినిమాలకు దగ్గరయ్యారు. బాలయ్య నటిస్తోన్న 99వ చిత్రం 'డిక్టేటర్‌' ఈనెల 14న సంక్రాంతికి విడుదలకానుంది. ఆ తర్వాత బాలయ్య తన 100వ సినిమా చేయనున్నాడు. ఈ వందవ చిత్రం తర్వాత మరలా సినిమాల్లో కనిపించే అవకాశాలు లేవని, ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇక రాజకీయాల్లో బిజీ కానున్నాడని సమాచారం. అదే సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. తమిళ 'కత్తి'ని ఆయన తెలుగులో వినాయక్‌ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించి, కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన చిరు ఈ 150వ చిత్రం తర్వాత ఇక సినిమాల్లో నటించే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ రెండు చిత్రాలు ఇదే ఏడాది ప్రారంభంకానున్నాయి. దీంతో ఈ ఇద్దరి చివరి సినిమాలకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఒకపక్క ఆయా హీరోల అభిమానుల భారీ అంచనాలు, ఇక తమ అభిమాన హీరోలు సినిమాలు చేయలేరనే బాద మరోవైపు వారికి ఏకకాలంలో కలుగుతున్నాయి. మరి వారి మైల్‌స్టోన్‌ చిత్రాలు ఎలాంటి మలుపులు తిరుగనున్నాయి? అవి ఎంతటి భారీ విజయాలను నమోదు చేయనున్నాయి? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ