Advertisementt

ప్రేమ తుస్సుమంది, కళ్యాణం సంగతేంటో?

Sat 02nd Jan 2016 06:09 PM
naga shaurya,abbayitho ammayi,kalyana vaibhogame  ప్రేమ తుస్సుమంది, కళ్యాణం సంగతేంటో?
ప్రేమ తుస్సుమంది, కళ్యాణం సంగతేంటో?
Advertisement
Ads by CJ

బాయ్ నెక్స్ట్ డోర్ లుక్స్ ఉన్న హ్యాండ్ సమ్ కుర్ర హీరో నాగశౌర్య కెరీర్ మందగించడానికి గల కారణాలు ఏమిటన్నది ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన సీక్రెట్. అందుకే మాస్ హీరోగా రాత్రికి రాత్రే ఎదిగి పోవాలనుకున్న జాదూగాడు మట్టి కరవడంతో బుద్దిగా అబ్బాయితో అమ్మాయి అనే రొమాంటిక్ ఫిలిం ఒప్పుకున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వ ప్రతిభ గురించి తెలిసినా పైగా ఫేస్ బుక్ అనే ఓ నేటి యువత ఎగబడే కథాంశం కావడంతో నాగశౌర్యకు సేఫ్ ఫిలిం పడింది అనుకున్నారు జనమంతా. దురదృష్టం కొద్దీ... నిన్నే రిలీజయిన అబ్బాయితో అమ్మాయి అటు యువతకు ఇటు ఫ్యామిలీసుకు ఎటూ కొరగాకుండా పోయి బోరింగ్ సినిమాగా పేరు సాధించింది. ఫేస్ బుక్ ప్రేమల మీద టాపిక్ మొదలుపెట్టి ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు ఎటువంటి పని, పస లేకుండా సాగిన కథనం నీరసించి ప్రేక్షకులను చికాకుకు గురిచేసింది. ఎలాగో అంతర్జాల మహిమతో ఫేస్ బుక్ ప్రేమాయణం కథ మొదటి రోజుతోనే ఫలితం తేలిపోయింది. తదుపరి నాగశౌర్యకు మిగిలింది కళ్యాణమే... అదేనండీ నందిని రెడ్డి దర్శకత్వంలో రానున్న కళ్యాణ వైభోగమే. ప్రేమ ఎలాగో వికటించింది మరి పెళ్లి సంగతి ఏమంటారు? ఫిబ్రవరిలో తెలుస్తుందిలెండీ! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ