Advertisementt

డిక్టేటర్ కోసం రంగంలోకి దిగిన లీడర్లు

Sat 02nd Jan 2016 04:12 PM
dictator,balakrishna,krishna district  డిక్టేటర్ కోసం రంగంలోకి దిగిన లీడర్లు
డిక్టేటర్ కోసం రంగంలోకి దిగిన లీడర్లు
Advertisement
Ads by CJ

పరువు కోసం, ప్రతిష్ట కోసం అన్నట్లుగా తయారయింది బాలకృష్ణ డిక్టేటర్, జూనియర్ ఎన్టీయార్ నాన్నకు ప్రేమతో సినిమాల మధ్య పోరు. సంక్రాంతికి కోడి పుంజు పందాలు, బెట్టింగులు తెలిసినవే కానీ సినిమాల మీద కూడా ఈ స్థాయి పోటీ వాతావరణం నెలకొంటుంది అన్న విషయం ఇంతకు మునుపు తెలియాలా. ఈనెల 12, 13 తారీఖులలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ రావడం ఖాయం అని తేలిపోవడంతో ఇప్పుడు ఏ సినిమాకి ఎక్కువ రిలీజ్ సినిమా హాల్స్ దొరుకుతాయా అని దిశగా అభిమానులు వేచి చూస్తున్నారు. నైజాంలో ఎప్పుడూ పెద్ద పోటీ అట్మోస్ఫియర్ ఉండదు కానీ కృష్ణ, ఈస్ట్, వెస్ట్ మాత్రం నందమూరి అభిమానులతో క్రిక్కిరిసి పోతుంది. సో, తెదేపా లీడర్లు స్వయంగా రంగంలోకి దిగి విజయవాడ, కాకినాడ, భీమవరం, ఏలూరు తదితర పట్టణాల్లో డిక్టేటర్ సినిమాకు అత్యధిక థియేటర్లు వచ్చేలా అడ్వాన్సులు చెల్లించి మరీ బుక్ చేస్తున్నారు. అసలు సినిమా ఎలాగున్నా నందమూరి బాలకృష్ణ అభిమానులకు అసలు సిసలైన పండగ మజా దొరికేలా ఉంది. మొదటి వారం మొత్తం కృష్ణాలో ఇక డిక్టేటర్ రచ్చరచ్చే.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ