Advertisementt

మహేష్ రికమెండ్ చేయకుండానే...!

Mon 07th Dec 2015 08:12 PM
dil raju,bhale manchi roju,sudheer babu  మహేష్ రికమెండ్ చేయకుండానే...!
మహేష్ రికమెండ్ చేయకుండానే...!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు బావ సుధీర్ బాబుకు కష్టకాలం అయిపోయే సమయం వచ్చింది. అందుకే సుధీర్ హీరోగా వస్తున్న భలే మంచి రోజు మీద బంగారు హస్తం ఉన్న దిల్ రాజు కన్ను పడింది. ఈ మధ్యే దిల్ రాజు చేయి పడ్డ కుమారి సూపర్ హిట్టయి ఎక్కడికో వెళ్ళిపోయింది. వెనువెంటనే దిల్ రాజు గారు భలే మంచి రోజు నైజాం హక్కులను తీసుకున్నారన్న వార్త సినిమాకు భలే మంచి చేయనుంది. సినిమాను ప్రివ్యూ షో వేయించుకొని చూసిన తరువాతే దాని వ్యాపార స్థాయిని అంజనం వేసి చెప్పే దిల్ రాజు అదే పాలిసీని ఇప్పుడు భలే మీద కూడా ప్రదర్శించారు. ఇది తప్పకుండా హిట్ మెటీరియల్ అని పక్కాగా నచ్చిన తరువాతే నైజాం రిలీజుకు సిద్ధపడ్డారు, అందుకే నిర్మాతకు అడ్వాన్స్ చేతిలో పెట్టేశారట. దిల్ రాజు బ్రాండ్ వల్ల సినిమాకు మిగతా ఏరియాల బిజినెస్ కూడా ఊపందుకోనుంది అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నిజంగా, బావ మహేష్ బాబు రికమండేషన్ లేకుండానే భలే మంచి రోజు బేరం అయిపోయిందట.   

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ