Advertisementt

రెడీ ఫర్ రిలీజ్: కాకి!

Mon 07th Dec 2015 05:58 PM
kaki movie ready for release,kiran patthikonda,manon  రెడీ ఫర్ రిలీజ్: కాకి!
రెడీ ఫర్ రిలీజ్: కాకి!
Advertisement
Ads by CJ

అశోక్ కుమార్, కిరణ్, మేఘాశ్రీ ప్రధాన పాత్రల్లో అర్పిత క్రియేషన్స్ పతాకంపై మనోన్.యం దర్శకత్వంలో కిరణ్ పత్తికొండ నిర్మిస్తున్న సినిమా కాకి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిశంబర్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

నిర్మాత కిరణ్ పత్తికొండ మాట్లాడుతూ.. ''కాకి అనేది డిఫరెంట్ టైటిల్. సబ్జెక్టు కు సూట్ అవుతుంది. 45 రోజులు సినిమా షూటింగ్ చేసాం. అందులో పది రోజులు 24 గంటలు షూట్ చేస్తూనే ఉన్నాం. సినిమాలో సిట్యుయేషన్ లు తగ్గట్లుగా ఒక పాట ఉంటుంది. హారర్ కథకు థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి తీసాం. సినిమాలో మొదటి భాగం కామెడీ తో, రెండవ భాగం హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సాగుతుంటుంది. డైరెక్టర్ కు మొదటి సినిమా అయినా బాగా డైరెక్ట్ చేసారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. డిశంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రెండు గంటల పది నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు మనోన్.యం మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. టీం వర్క్ తో తొందరగా సినిమా కంప్లీట్ చేసాం. కథ చాలా కొత్తగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ చిత్రమిది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా: సర్వన నటరాజన్, మ్యూజిక్: అమ్రిత్, ఎడిటర్: శశికుమార్, ఆర్ట్: జె.కె.మూర్తి, డైలాగ్స్: వినోద్ శివ, లిరిక్స్: భాస్కర్ భట్ల, స్టొరీ-ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోనాల్డ్ రాజ్.ఎస్.విలియమ్స్, ప్రొడ్యూసర్: కిరణ్ పత్తికొండ, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: మనోన్.యం

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ