Advertisementt

'రాయబారి' వరుణ్‌తేజేనట..!

Fri 04th Dec 2015 03:20 PM
rayabhari movie,varun tej,krish,akhil akkineni  'రాయబారి' వరుణ్‌తేజేనట..!
'రాయబారి' వరుణ్‌తేజేనట..!
Advertisement
Ads by CJ

'కంచె' చిత్రంతో మంచి విజయాన్ని, విమర్శకుల ప్రశంసలను పొందిన హీరో వరుణ్‌తేజ్‌, దర్శకుడు క్రిష్‌.. ఇద్దరు మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇటీవల క్రిష్‌ 'రాయభారి' అనే టైటిల్‌ను రిజిష్టర్‌ చేయించిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో అక్కినేని అఖిల్‌ నటించనున్నాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరి క్షణంలో మనసు మార్చుకున్న క్రిష్‌ తాను ఆల్‌రెడీ 'కంచె'తో మంచి నటునిగా నిరూపించిన వరుణ్‌తేజ్‌నే ఈ చిత్రానికి తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ సీక్రెట్‌ ఏజెంటుగా కనిపించబోతున్నాడు. ఇందులో వరుణ్‌తేజ్‌ లుక్‌ కూడా ఎంతో భిన్నంగా ఉంటుందని సమాచారం. ఓ సీక్రెట్‌ మిషన్‌ కోసం వరుణ్‌తేజ్‌ ఏజెంటుగా పనిచేస్తాడని అంటున్నారు. రొమాంటిక్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు క్రిష్‌ సిద్దమవుతున్నాడు. రాజీవ్‌రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి కలిసి సంయుక్తంగా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో ఈ సినిమాని నిర్మించేందుకు సిద్దమవుతున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ