Advertisement

బెంగాల్ టైగర్ పైనే అందరి కన్ను!

Sat 28th Nov 2015 05:47 PM
bengal tiger,sampat nandi,raviteja  బెంగాల్ టైగర్ పైనే అందరి కన్ను!
బెంగాల్ టైగర్ పైనే అందరి కన్ను!
Advertisement

రవితేజ బెంగాల్ టైగరుకు దారివ్వకుండా నిలబడిన ఒక్కొక్క సినిమా సంగతి తేలుతోంది. అఖిల్, సైజు జీరో తమ తమ ఫలితాన్ని తెల్చేసుకోవడంతో ఇక మిగిలిన శంకరాభరణం వచ్చేవారం రానుంది. ఎటు నుండి చూసినా ఇప్పుడు అందరి కన్ను మాస్ మహారాజా బెంగాల్ టైగర్ మీదే ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో రాధా మోహన్ నిర్మాతగా రానున్న ఈ పూర్తి స్థాయి మాస్ మసాలా కమర్షియల్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. భీమ్స్ అందించిన ఊర మాస్ పాటలకు మార్కెట్టులో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అలాగే తమన్నా, రాశి ఖన్నాలు కూడా జంకు బొంకు లేకుండా సినిమా గ్లామరును మరో మెట్టు పైకి ఎక్కించారు. రవితేజలోని ఎనర్జీని ఇంతవరకు ఏ దర్శకుడు వాడని స్థాయిలో పరిపూర్ణంగా సంపత్ ఉపయోగించాడని తెలియడంతో మాస్ రాజా అభిమానులలో సైతం సినిమా పట్ల కొండంత విశ్వాసం కనపడుతోంది. డిసెంబర్ పదిన సినిమా హాళ్ళలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న బెంగాల్ టైగర్ గాండ్రింపులు బాక్సాఫీసును గడగడలాడించబోతున్నాయి అనడంలో ఇక సందేహం అవసరం లేదు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement