Advertisementt

గోపీచంద్ ఈ భామను వదిలేట్లు లేడు!

Wed 25th Nov 2015 07:28 PM
gopichand,rashi khanna,jyothi krishna,jil movie,gopichand again with rashi khanna  గోపీచంద్ ఈ భామను వదిలేట్లు లేడు!
గోపీచంద్ ఈ భామను వదిలేట్లు లేడు!
Advertisement
Ads by CJ

'జిల్‌' సినిమా కమర్షియల్‌గా పెద్దగా వర్కౌట్‌ కాకపోయినా గోపీచంద్‌, రాశిఖన్నాల మధ్య రొమాంటిక్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. త్వరలో ఈ ఇద్దరు మరోసారి వెండితెరపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో తరుణ్‌తో 'నీ మనసు నాకు తెలుసు' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. మూడేళ్ల కిందట వచ్చిన 'ఊలలలా' తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వంలో మరో సినిమా రాలేదు. అయితే రీసెంట్‌గా ఆయన ఓ స్టోరీని గోపీచంద్‌కు వినిపించి ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం ప్రీపొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. 'జిల్‌' సినిమాలో గోపీచంద్‌, రాశిఖన్నా జోడీలుగా కుదరడంతో వారిద్దరితోనే సినిమా చేయాలని డైరెక్టర్‌ ఫిక్స్‌ అయ్యాడని సమాచారం. కాగా గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సౌఖ్యం' డిసెంబర్‌లో విడుదలకు సిద్దమవుతోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ