Advertisementt

సీరియల్స్ మాత్రం వదలను: అవికాగోర్!

Wed 25th Nov 2015 07:06 PM
avikagor interview about thanu nenu,thanu nenu movie,rammohan  సీరియల్స్ మాత్రం వదలను: అవికాగోర్!
సీరియల్స్ మాత్రం వదలను: అవికాగోర్!
Advertisement
Ads by CJ

సంతోష్ శోభన్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో సన్ షైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్మోహన్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'తను నేను'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు హీరోయిన్ అవికాగోర్ మాటల్లో.. ''ఈ సినిమాలో కీర్తి అనే పాత్రలో కనిపించనున్నాను. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించే అమ్మాయి. తనకు నచ్చింది మాత్రమే చేస్తూ.. ఉంటుంది.  నా నిజజీవితానికి భిన్నంగా ఉండే పాత్ర. రియల్ లైఫ్ లో నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోలేను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసి అవికా ఇలా కూడా ఉంటుందా..? అనుకుంటారు. ఇదొక సెన్సిబుల్ లవ్ స్టొరీ. రెగ్యులర్ గా ఉండదు. రామ్మోహన్ గారు మొదటిసారి డైరెక్ట్ చేసారు. 'ఉయ్యాలా జంపాలా' తరువాత వారితో కలిసి వర్క్ చేసాను. స్క్రిప్ట్ వినగానే మరోసారి టీం తో కలిసి పనిచేయాలనే ఉద్దేశ్యంతో ఓకే చెప్పాను. రామ్మోహన్ గారు నిర్మాతగా వ్యవహరించడానికి, దర్శకునిగా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా కమిట్మెంట్ తో వర్క్ చేస్తారు. డైరెక్టర్ గారు ఎలా చెప్తారో.. నేను అలా నటిస్తాను. మంచి నటిగా నిరూపించుకోవడానికి రకరకాల పాత్రల్లో నటించాలి. ఈ సినిమాతో మంచి గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉంది. టీవీ సీరియల్స్ లో నటించడానికి, సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి డిఫరెన్స్ ఉంటుంది. నేను సినిమాల్లో నటిస్తూనే.. సీరియల్స్ లో కూడా నటిస్తాను. సీరియల్స్ లో నటించడం మాత్రం వదులుకోను. నెక్స్ట్ తెలుగులో ఓ సినిమా కమిట్ అయ్యాను. చాలా ఇంటరెస్టింగ్ గా ఉండే ప్రాజెక్ట్ అది. త్వరలోనే తెలియజేస్తాను'' అని చెప్పారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ