Advertisementt

ఇక చిరుతో లాభం లేదనుకున్నాడు..!

Sat 21st Nov 2015 01:26 PM
v.v.vinayak,akhil movie folp,chiranjeevi 150th film,ntr,adhurs  ఇక చిరుతో లాభం లేదనుకున్నాడు..!
ఇక చిరుతో లాభం లేదనుకున్నాడు..!
Advertisement
Ads by CJ

వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి నటించే 150వ సినిమా పట్టలెక్కనుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే చిరు కథ విషయంలో బాగా నాన్చుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌ ముందుకు సాగడం లేదు. ఆల్రెడీ దర్శకుడు పూరీజగన్నాథ్‌ చిరు కోసం కష్టపడి కొంత సమయం కేటాయించి వేస్ట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ 'అఖిల్‌' సినిమా ఫ్లాప్‌ కావడంతో కాస్త డల్‌ అయిపోయిన వినాయక్‌ చిరు 150వ సినిమా అవకాశం వస్తుందని ఎదురుచూస్తే విలువైన సమయం కోల్పోతానని గ్రహించినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేయాలనే ఆలోచనలో వినాయక్‌ ఉన్నట్లు సమాచారం. రెండు నెలలు గ్యాప్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించిన వినాయక్‌ ఇందుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా వచ్చి చాలాకాలం అయింది. చివరగా వచ్చిన 'అదుర్స్‌' మూవీ అప్పట్లో సూపర్‌హిట్‌ అయింది. ఈసారి కూడా ఆయన ఎన్టీఆర్‌తో పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉండేలా సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడట.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ