Advertisementt

గుణశేఖర్, వైట్ల, వినాయక్ - పోయే పోచే

Tue 17th Nov 2015 03:56 PM
gunasekhar,vv vinayak,srinu vytla  గుణశేఖర్, వైట్ల, వినాయక్ - పోయే పోచే
గుణశేఖర్, వైట్ల, వినాయక్ - పోయే పోచే
Advertisement
Ads by CJ

స్టార్ దర్శకులుగా వెలుగుతున్న గుణశేఖర్, శ్రీను వైట్ల, వీవీ వినాయక్ గార్లు వరస పరాజయాలతో తెలుగు సినీ పరిశ్రమకు తిరుగులేని కరెంట్ షాకులు తగిలించారు. రుద్రమదేవి మొదలైన దగ్గర నుండి పడిన కష్టాలు ఇప్పుడు రిలీజ్ తరువాత కూడా గుణశేఖరాన్ని వదలడం లేదు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ప్రీ రిలీజ్ వ్యాపారం ఆశావహంగా సాగడంతో గుణశేఖర్ నష్టం కొంతలోకొంత తగ్గిందన్నది వాస్తవం. కానీ శ్రీను వైట్లకు మాత్రం అటువంటి ఫేవర్ పెద్దగా జరిగినట్టు లేదు. రామ్ చరణ్ అండ్ మెగా బ్రాండ్ మీద బ్రూస్ లీ భారీగానే ఓపెనింగ్ వసూళ్లు రాబట్టినా లెక్కలు మొత్తంగా చూస్తే నిర్మాతకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు పూడ్చుకోవాల్సినవి పెద్దగానే ఉన్నాయి. ఇక వీవీ వినాయక్ విషయాని వస్తే, అతని చరిత్రలో అఖిల్ లాంటి చెత్త సినిమా తీయలేదు, ఇక తీయబోడు అన్నది బాటం లైన్. రుద్రమదేవి, బ్రూస్ లీని మించిన ఫెయిల్యూరుగా అఖిల్ అన్ని అంచనాలు దాటేసి, ఈ ఏడాది అత్యుత్తమ ఫ్లాపుల్లో నాణ్యమైన రకం కింద అవార్డు ఎగరేసుకు పోవచ్చు. రాజకీయంలో గెలుపోటములు ఎంత సహజమో, చిత్ర పరిశ్రమలో హిట్టు-ఫ్లాపులు అంతే సహజం. మాకు బ్రేక్ కావాలి అంటూ ఒకరి వెనక ఒకరుగా ఇట్స్ గాన్, పోయే పోచె, పోయిందే అన్నట్టుగా కనిపించకుండా పోయిన గుణశేఖర్, వైట్ల, వినాయక్ గార్లు ఓటముల నుండి తేరుకొని మన ముందుకు మళ్ళీ రావాలని విజ్ఞ్యప్తి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ