Advertisement

అవును, మా ఆవిడే గ్రేట్

Tue 17th Nov 2015 03:43 PM
rajeev kanakala,suma,tv anchor suma  అవును, మా ఆవిడే గ్రేట్
అవును, మా ఆవిడే గ్రేట్
Advertisement

ఆడదాని వయసు, మగవాడి సంపాదన అడగకూడదు అన్నది ఆనాటి సామెత. ఆడ, మగ తేడా లేకుండా  పోటాపోటీగా సాగిపోతున్న ఈ ఫాస్ట్ జనరేషనులో ఇటువంటి సామెతలకు చోటు లేదు అంటున్నాడు రాజీవ్ కనకాల. యాక్టరుగా అందరి ప్రశంసలు పొంది, కొద్ది చిత్రాలతోనే మంచి పొజిషన్ చేరిన రాజీవ్ అటు తరువాత క్రమేపీ తెరమరుగయ్యాడు. ఇతను తెరమరుగవుతున్న దిగువ క్రమంలోనే అతని భార్య సుమ ఎగువ క్రమంలో తిరుగులేని వ్యాఖ్యాతగా ఎనలేని పేరు ప్రతిష్టలు సంపాదించింది.

అవును, నా కంటే మా ఆవిడే ఎక్కువ సంపాదిస్తుంది. అసలు మా ఆవిడ చాలా గ్రేట్. ఒక భార్యగా, ఒక తల్లిగా అలాగే ఓ కష్టపడే తత్వం ఉన్న ఆర్టిస్టుగా ప్రస్తుతం అందరి మన్ననలు పొందుతోంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. ప్రస్తుతం సుమ టైం చాలా బాగా నడుస్తోంది. ఈ విషయాన్ని ఒప్పుకోవడంలో నాకు ఎటువంటి ఈగో ఫీలింగ్ లేదు, అంటున్నారు రాజీవ్ కనకాల.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement