Advertisementt

సమంత సాహసానికి రెడీ అయింది!

Mon 09th Nov 2015 09:31 PM
samantha,dhanush,vettimaran,vada chennai movie  సమంత సాహసానికి రెడీ అయింది!
సమంత సాహసానికి రెడీ అయింది!
Advertisement
Ads by CJ

'ఏమాయ చేసావే' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకొని ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న నటి సమంత. ఇప్పటివరకు సమంత ఏ సినిమాలో అయినా చాలా రిచ్ గా, గ్లామరస్ గానే కనిపించింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం బట్టి ఆమె ఓ డీ గ్లామరస్ రోల్ లో నటించబోతోందని తెలుస్తుంది. తమిళ దర్శకుడు వెట్టిమారన్ ప్రస్తుతం 'వాడా చెన్నై' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్, సమంత జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత మురికివాడకు చెందిన అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రలో నటించడానికి ఓకే చెప్పి పెద్ద సాహసానికి రెడీ అయిందనే చెప్పాలి. సమంతను అలాంటి పాత్రలో చూసి తన అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో మరి..!   

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ