రైట్ రైట్ అంటున్న సుమంత్ అశ్విన్!

Mon 09th Nov 2015 08:18 PM
right right movie,sumanth ashwin,vamsikrishna,sreenivasaraju  రైట్ రైట్ అంటున్న సుమంత్ అశ్విన్!
రైట్ రైట్ అంటున్న సుమంత్ అశ్విన్!
Sponsored links

లవర్స్, కేరింత, కొలంబస్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న సుమంత్ అశ్విన్ ప్రస్తుతం 'రైట్ రైట్' అంటున్నారు. శ్రీ సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 7న ఆరంభం కానుంది. ఈ చిత్రవిశేషాలను..

జె. వంశీకష్ణ తెలియజేస్తూ.. ''మంచి కథలు, పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ సాగిస్తున్న సుమంత్ అశ్విన్ ఖాతాలో ఇది మరో మంచి చిత్రం అవుతుంది. ఇప్పటివరకూ ఆయన చేసిన చిత్రాలకు, పాత్రలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రం ఇది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఓ సంచలన చిత్రానికి ఇది రీమేక్.  'మర్యాద రామన్న', 'బాహుబలి' చిత్రాల్లో విలన్ గా చేసిన ప్రభాకర్ ఇందులో కామెడీ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆ పాత్ర ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. విజయనగరం, అరకు లోయ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం. యూత్, ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే విధంగా ఈ 'రైట్ రైట్' ఉంటుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, కెమెరా: శేఖర్ వి. జోసఫ్, సంగీతం: జె.బి, ఆర్ట్: కె.ఎం. రాజీవ్, సహ నిర్మాత: జె. శ్రీనివాస రాజు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019