Advertisementt

ఒంటరైపోతున్న రామ్‌చరణ్‌...!

Wed 04th Nov 2015 09:01 AM
ram charan tej,magadheera,brucelee,allu arjun  ఒంటరైపోతున్న రామ్‌చరణ్‌...!
ఒంటరైపోతున్న రామ్‌చరణ్‌...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ్‌చరణ్‌ ఫ్లాప్‌ల్లో ఉన్నాడు. వరుసగా 'గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ' చిత్రాలతో ఆయన ఇబ్బందులో పడ్డాడు. వాస్తవానికి ఇప్పుడు రామ్‌చరణ్‌కు అర్జంట్‌గా ఓ బ్లాక్‌బస్టర్‌ కావాలి. ఆయనకు 'మగధీర' తర్వాత మరో బ్లాక్‌బస్టర్‌ రాలేదు. 'రచ్చ, నాయక్‌, ఎవడు' వంటి చిత్రాలన్నీ కేవలం హిట్స్‌ మాత్రమే. కానీ కేవలం హిట్స్‌ ఇప్పుడు రామ్‌చరణ్‌కు అక్కర్లేదు. ఆయనకు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావాలి. లేకపోతే ఆయన కెరీర్‌కే ఇబ్బంది వచ్చే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆయనకు పోటీనా అన్నట్లు మరో మెగాక్యాంపు హీరో అల్లుఅర్జున్‌ మాత్రం 'జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి' వంటి చిత్రాలతో రోజు రోజుకు తన మార్కెట్‌ పరిధిని విస్తరిస్తున్నాడు. ఇలా బన్నీ మాత్రం రేంజ్‌ పెంచుకుంటూ ఉంటే రామ్‌చరణ్‌ మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇక వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌లు కూడా బాగానే తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. ఇలా మెగాఫ్యామిలీ హీరోలు దూసుకుపోతుంటే రామ్‌చరణ్‌ మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు. కేవలం మాస్‌ సినిమాలు చేస్తే లాభం లేదని గ్రహించి ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన 'గోవిందుడు అందరివాడేలే', 'బ్రూస్‌లీ' చిత్రాలు సరిగ్గా వర్కౌట్‌ కాలేదు. మరి చెర్రీకి మరో బ్లాక్‌బస్టర్‌ ఎవరి నుండి.. ఎప్పుడు వస్తుందో అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ