Advertisementt

పూరీ గారికి మెగా తోక కావాలి?!

Tue 03rd Nov 2015 02:28 PM
varun tej,puri jagannath,loafer,naga babu  పూరీ గారికి మెగా తోక కావాలి?!
పూరీ గారికి మెగా తోక కావాలి?!
Advertisement
Ads by CJ

పేర్ల పక్కన స్టార్ బిరుదులు తగిలించుకోవడం ఇండియన్ హీరోలకి అలవాటు అయిపోయింది. అలాంటి తోకలు లేకపోతే మనోళ్ళకి ప్రాణవాయువు అందనంత ఫీలయిపోతారు. ఇక బడా ఫ్యామిలీల నుండి వస్తున్న కుర్ర హీరోలకు కూడా దీని వాసన తాకుతోంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గానూ, అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గాను, నిన్న గాక మొన్నొచ్చిన సాయి ధరం తేజ్ సుప్రీమ్ స్టార్ గాను వెలిగిపోతున్నారు. అలాగే నందమూరి వంశం నుండి ఎప్పటికి వస్తాడో ఇంకా తెలియని మోక్షజ్ఞకు కూడా ఫ్యాన్స్ ఓ బిరుదును అంకితం చేసారు.

మరి ఇంత మందికి ఇన్ని ఉన్నా వరుణ్ తేజకు ఎలాంటి తోక లేకపోవడం ఏంటబ్బా? ముకుంద, కంచె లాంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త ఇమేజిని సంపాదించిన వరుణ్ తేజ తదుపరి మూవీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని లోఫర్. సినిమా మొదట్లో వచ్చే క్రెడిట్స్ ప్రకారం వరుణ్ తేజ పక్కన ఏదో ఒక మెగా బిరుదు తగిలించాలన్న డిమాండు నాగబాబు దాకా రావడం, అక్కడి నుండి పూరీ దాకా వెళ్ళడంతో వేట మొదలైంది. మెగా, పవర్, సుప్రీమ్ అయిపోవడంతో పూరీ జగన్నాథ్ ఏ వింత బిరుదాంకితుడు అవుతాడా అన్నది ఇప్పటికి సస్పెన్సే.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ