Advertisement

'రెడ్ అలర్ట్' రిలీజ్ కు సిద్ధం!

Tue 03rd Nov 2015 05:40 PM
red alert movie release press meet,mahadev,chandra mahesh  'రెడ్ అలర్ట్' రిలీజ్ కు సిద్ధం!
'రెడ్ అలర్ట్' రిలీజ్ కు సిద్ధం!
Advertisement

హెచ్.హెచ్.మహాదేవ్, అంజనా మీనన్ జంటగా పి.ఎన్.త్రిలోక్ రెడ్డి సమర్పణలో సినీలయ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై చంద్రమహేష్ దర్శకత్వంలో పి.వి.శ్రీరాంరెడ్డి( లేట్) నిర్మించిన సినిమా 'రెడ్ అలర్ట్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

డైరెక్టర్‌ చంద్రమహేష్‌ మాట్లాడుతూ 'నాలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించాం. కన్నడ, మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో నవంబర్ 6న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇదొక కామెడీ, థ్రిల్లర్ మూవీ. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా రూపొందించాం. ఓ నలుగురు కుర్రాళ్ళు కర్ఫ్యూ విధించిన సమయంలో సిటీకు వస్తారు. వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నాం. రవివర్మ నాలుగు పాటలను చాలా డిఫరెంట్‌గా అందించాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను కూడా అధ్బుతంగా ఉంటుంది' అని చెప్పారు.

హెచ్.హెచ్.మహదేవ్ మాట్లాడుతూ 'చంద్రమహేష్‌గారు చాలా కష్టపడి సినిమాని తెరకెక్కించారు. మంచి టెక్నీషియన్స్ అంతా ఈ చిత్రానికి పని చేసారు. నాన్నగారు అకాల మరణం వలన సినిమా రిలీజ్ చేయడం లేట్ అయింది. ఆయన ఉంటే ఇప్పటికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేవారు. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరించాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు.

రవి వర్మ మాట్లాడుతూ 'బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా రావడానికి కారణం కథే. చాలా న్యాచురల్ గా ఉంటుంది. పండగలకు నా పాటలు అందరు వినాలనే కోరిక ఉండేది. ఈ సినిమాతో నా కోరిక నెరవేరింది. వినాయక చవితి రోజు గణేశా.. అనే పాట రెండు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. ఆ పాట పాడిన శంకర్ మహదేవన్ గారికి థాంక్స్' అని చెప్పారు.

వెనిగళ్ళ రాంబాబు మాట్లాడుతూ 'ఉగ్రవాద నేపధ్యానికి మానవతా విలువలను జోడించి ఈ సినిమా తీసారు. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.

సుమన్‌, కె.భాగ్యరాజ్‌, అలీ, పోసాని, వినోద్‌కుమార్‌, రవిప్రకాష్‌ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీరామ్‌ చౌదరి, సంగీతం: రవివర్మ, కెమెరా: కళ్యాణ్‌ సమి, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: వెనిగళ్ళ రాంబాబు, శ్రీరామ్‌ తపస్వి, శ్రీవల్లి, ఫైట్స్‌: హార్స్‌మెన్‌బాబు, జాషువ, ఆర్ట్‌: సాయిమణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: జైపాల్‌ రెడ్డి, కో ప్రొడ్యూసర్‌: పిన్నింటి శ్రీరాం సత్యారెడ్డి, ప్రొడ్యూసర్‌: పి.వి.శ్రీరామ్‌ రెడ్డి, స్కీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రమహేష్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement