Advertisementt

చౌదరి డైరెక్షన్ లో రాజ్ తరుణ్..?

Mon 02nd Nov 2015 07:57 PM
raj tarun,kumari 21f,y.v.s.chowdary,rey movie  చౌదరి డైరెక్షన్ లో రాజ్ తరుణ్..?
చౌదరి డైరెక్షన్ లో రాజ్ తరుణ్..?
Advertisement
Ads by CJ

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అనుకోకుండా హీరో అయిపోయాడు రాజ్ తరుణ్. తను నటించిన ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో తరుణ్ మినిమం గ్యారంటీ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. ప్రస్తుతం తను నటించిన కుమారి 21 ఎఫ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. అనుకున్నట్లుగానే ఈ సినిమా హిట్ అయితే రాజ్ తరుణ్ బిజీ హీరో అయిపోతాడని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ యువ హీరోను చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో నటించమని సంప్రదించారట. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేయబోయే సైలెంట్.. సినిమాలో నటించడానికి రాజ్ తరుణ్ ఎప్పుడో ఓకే చెప్పేసాడు. తాజాగా మరో డైరెక్టర్ వై.వి.ఎస్.చౌదరి, రాజ్ తరుణ్ ను సంప్రదించారని సమాచారం. రేయ్ సినిమా ఫ్లాప్ తరువాత వై.వి.ఎస్ చాలా రోజులు ఎవరికి కనిపించలేదు. ఈ గ్యాప్ లో ఆయనొక మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని, రాజ్ తరుణ్ కు వినిపించారట. స్క్రిప్ట్ నచ్చడంతో రాజ్ తరుణ్ నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గురించి పూర్తి స్థాయిలో వివరాలు తెలియనున్నాయి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ