వరుణ్‌ పిలుపు కోసం వెయిట్‌ చేస్తున్న డైరెక్టర్‌.!

Wed 28th Oct 2015 04:07 AM
hero varun tej,varun tej new movie kanche,varun tej next movie with veeru potla,varun tej and puri jagannath combo movie loafer  వరుణ్‌ పిలుపు కోసం వెయిట్‌ చేస్తున్న డైరెక్టర్‌.!
వరుణ్‌ పిలుపు కోసం వెయిట్‌ చేస్తున్న డైరెక్టర్‌.!
Sponsored links

వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు కథను అందించిన వీరుపోట్ల బిందాస్‌తో దర్శకుడుగా కూడా ప్రూవ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత రగడ, దూసుకెళ్తా చిత్రాలను రూపొందించి ప్రస్తుతం వెంకటేష్‌, రవితేజ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ని ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ ఓ పక్క జరుగుతుండగానే వరుణ్‌తేజ్‌ కోసం ఒక సబ్జెక్ట్‌ రెడీ చేశాడట వీరు. కంచెతో ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న వరుణ్‌కి తగ్గట్టుగా వీరు సబ్జెక్ట్‌ రెడీ చేశాడని తెలుస్తోంది. 

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌ చేస్తున్న లోఫర్‌ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటించబోతున్నాడు వరుణ్‌. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. ఇక వీరు పోట్ల రెడీ చేసిన సబ్జెక్ట్‌ని ఆల్రెడీ వరుణ్‌కి వినిపించాడని తెలిసింది. అతనికి ఈ సబ్జెక్ట్‌ బాగా నచ్చిందట. వరుణ్‌ని డైరెక్ట్‌ చెయ్యాలని ఎంతో ఉత్సాహంగా వున్న వీరు పోట్ల అతని గ్రీన్‌ సిగ్నల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడట. మరి వీరు వరుణ్‌ పిలుపు అందుకుంటాడా? లేదా? 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019