Advertisementt

ఫ్లాప్‌ చిత్రానికి నగిషీలు..!

Tue 27th Oct 2015 11:02 PM
rebel movie,prabhas,bahubali,veerabali movie  ఫ్లాప్‌ చిత్రానికి నగిషీలు..!
ఫ్లాప్‌ చిత్రానికి నగిషీలు..!
Advertisement
Ads by CJ

బాహుబలి చిత్రంతో తమిళనాట ప్రభాస్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది. ఇక కొరియోగ్రాఫర్‌, యాక్టర్‌, డైరెక్టర్‌ అయిన రాఘవ లారెన్స్‌కు కూడా తెలుగులో కంటే తమిళంలోనే క్రేజ్‌ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని మిస్‌ చేసుకోకూడదని భావించిన కొందరు చోటా నిర్మాతలు ప్రభాస్‌-రాఘవలారెన్స్‌-తమన్నా వంటి వారికి తమిళంలో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా తెలుగులో రెబెల్‌ గా రూపొంది డిజాస్టర్‌ ఫలితాన్ని చవిచూసిన ఈ చిత్రాన్ని తమిళంలోకి వీరబలి అనే టైటిల్‌తో అనువాదం చేసి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తమిళంలోని చోటా చోటా నటీనటులతో కొన్ని సీన్స్‌ తీసి వాటిని ఈ అనువాదనికి కలపనున్నారని సమాచారం. కాగా ఈ చిత్రానికి పెట్టిన వీరబలి టైటిల్‌ను కూడా బాహుబలి తమిళ వెర్షన్‌కు పెట్టాలని రాజమౌళి ఆలోచించాడు. బాహుబలికి తమిళంలో మహాబలి, వీరబలి అనే టైటిల్స్‌ను పరిశీలించిన సంగతి తెలిసిందే. మరి ఆ టైటిల్స్‌లో ఒక దాన్ని రెబెల్‌ కు వాడుతున్నారు. మరి తెలుగులో డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తమిళంలో ఏమాయ చేస్తుందో చూడాలి...! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ