ఇటీవల అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మెగాహీరోల చిత్రాలు వరుసగా వారానికి ఒకటి చొప్పున రిలీజ్ అయ్యాయి. ఇక మెగాహీరోలు ఇప్పుడు కొత్త సినిమాలతో బిజీ అయిపోయారు. కాగా నవంబర్, డిసెంబర్ నెలలను సరిగ్గా వాడుకోవాలని ఈసారి అక్కినేని కుటుంబ హీరోలు భావిస్తున్నారు. అక్కినేని అఖిల్ అరంగేట్రం మూవీని దీపావళి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక నవంబర్ చివరి వారంలో గానీ లేదా డిసెంబర్ మొదటి వారంలో గానీ నాగచైతన్య-గౌతమ్‌మీనన్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సాహసం శ్వాసగా సాగిపో విడుదలకానుంది. దానికి కొద్ది గ్యాప్ తీసుకొని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరివారంలో నాగార్జున సోగ్గాడే చిన్నినాయన ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక వచ్చే జనవరిని నందమూరి హీరోలు ఇప్పుటికే బుక్ చేసుకున్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, నందమూరి నటసింహం బాలకృష్ణ డిక్టేటర్ చిత్రాలతో క్యూ కట్టనున్నారు.. మొత్తానికి వారుసులంటే ఆ క్రేజే వేరు...!