Advertisementt

షేర్ వైపూ చూడండి బాబులూ

Wed 21st Oct 2015 06:38 AM
sher release,sher business,nandamuri kalyanram,mallikarjun director  షేర్ వైపూ చూడండి బాబులూ
షేర్ వైపూ చూడండి బాబులూ
Advertisement
Ads by CJ

హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ గీత మార్చిన సినిమా పటాస్. అప్పటికే ఓ అరడజన్ పైగా ఫ్లాపులతో కళకళలాడుతున్న నందమూరి హీరో కెరీర్ అనిల్ రావిపుడి పుణ్యమాని ఇరవై కోట్ల క్లబ్బులో చేరి కాసింత ఊరటనిచ్చింది. అయితే ఇతగాడు నిర్మాతగా మాత్రం కిక్ 2తో భారీగా ఫైనాన్షియల్ ప్రమాదంలో పడిపోయాడు. తమ్ముడు జూనియర్ ఎన్టీయార్ సహాయంతో ఆ సినిమాను విడుదల చేసినా నష్టాలే చవి చూడాల్సి వచ్చింది. సో నిర్మాతగా మనుగడ సాధించడంతో పాటు హీరోగా నిలదొక్కుకుంటేనే కళ్యాణ్ రామ్ మరి కొన్నేళ్ళు మరి కొన్ని సినిమాల మీద రిస్క్ చేసే అవకాశం ఉంది.

ఇక భవిష్యత్తు సాఫీగా ఉండాలంటే ప్రస్తుతానికి ఆశలన్నీ షేర్ సినిమా మీద పెట్టుకున్నాడు. వరస ఫ్లాపులతో కళ్యాణ్ రామ్ బాబుకి ఇబ్బందిగా మారినా అదే మల్లికార్జునుని షేర్ దర్శకుడిగా చేయడం వెనక ఆంతర్యం ఏమిటో? ఈ నెల ముప్పైన విడుదల తేదీని అనౌన్స్ అయితే చేసారు గానీ బిజినెస్ పరంగా షేర్ పరిస్థ్తితి బ్రూస్ లీ, అఖిల్ చిత్రాలతో ముడిపడి ఉండడంతో బయ్యర్లు ఉత్సాహంగా ముందుకు రావటం లేదన్నది ఇండస్ట్రీ టాక్. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ