రాజు గారి గది విడుదలకు సిద్ధం!

Wed 21st Oct 2015 06:42 AM
rajugarigadi release date,omkar,ashwin babu,dhanya,poorna  రాజు గారి గది విడుదలకు సిద్ధం!
రాజు గారి గది విడుదలకు సిద్ధం!
Sponsored links

అశ్విన్ బాబు, చేతన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజు గారి గది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 22న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా..

ఓంకార్ మాట్లాడుతూ.. జీనియస్ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాను. హారర్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నిమ్మగడ్డ ప్రసాద్ గారికి రాజు గారి గది లైన్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. శాటిలైట్ సపోర్ట్ తోనే సినిమా చేసాను. అనిల్ సుంకర, సాయి కొర్రపాటి లు ఈ సినిమా ఇంత తొందరగా రిలీజ్ కావడానికి కారణం. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయి. ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను.. అని చెప్పారు.

పూర్ణ మాట్లాడుతూ.. అవును మూవీ తరువాత ఓంకార్ గారు నాకు ఈ సినిమా స్టొరీ చెప్పారు. బాగా నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పాను. కేరళ అమ్మయినైనా తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. ఈ చిత్రాన్ని కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

చేతన్ మాట్లాడుతూ.. చెన్నై లో ఉంటూ తమిళ సినిమాలు చేస్తున్న రోజుల్లో ఓంకార్ గారు కలిసి ఈ సినిమా లైన్ చెప్పారు. సెకండ్ థాట్ లేకుండా ఓకే చేసేసాను. అందరం చాలా కష్టపడి పని చేసాం. దానికి తగిన రిజల్ట్ వస్తుందని భావిస్తున్నాను.. అని చెప్పారు.

సాయి కార్తీక్ మాట్లాడుతూ.. దసరా రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. చిన్న చిత్రంగా మొదలుపెట్టినా అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గార్ల సపోర్ట్ తో పెద్ద సినిమా అయింది. సినిమా రిలీజ్ కు ముందే హిట్ టాక్ వస్తోంది. రిలీజ్ అయిన తరువాత ఇంకా పెద్ద హిట్ అవుతుంది.. అని చెప్పారు.

ధన్య మాట్లాడుతూ.. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా. టీం ఎఫర్ట్ పెట్టి చేసాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో విధ్యులేక రామన్, అశ్విన్ బాబు, జ్ఞానం, నాగరాజు, షకలక శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటర్: నాగరాజ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.జ్ఞానం, మ్యూజిక్: సాయి కార్తిక్, ప్రొడ్యూసర్: ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఓంకార్.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019