కొత్తవారితో ఆడుకుంటోన్న స్టార్స్‌..!

Wed 21st Oct 2015 04:09 AM
sampath nandi,harish shankar,sujeeth,prabhas  కొత్తవారితో ఆడుకుంటోన్న స్టార్స్‌..!
కొత్తవారితో ఆడుకుంటోన్న స్టార్స్‌..!
Sponsored links

కుర్ర దర్శకులు మొదటి చిత్రాలతోనే హిట్లుకొట్టి తమ సత్తా చాటుతున్నారు. కానీ మన స్టార్స్‌ మాత్రం వారిని పిలిచి అవకాశాలు ఇస్తామనే మాటైతే చెబుతున్నారు కానీ ఎంతకు సినిమాలు మొదలుపెట్టడం లేదు. ఓ స్టార్‌ మాటిచ్చాడని ఏళ్ల తరబడి ఒకే చిత్రానికి ఫిక్స్‌ అయిపోయిన యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ ఆ తర్వాత మరో హీరోను వెత్తుక్కోవాల్సి వచ్చి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. రన్‌ రాజా రన్‌ ద్వారా తానేమిటో నిరూపించుకున్న కుర్రదర్శకుడు సుజీత్‌తో ప్రభాస్‌ ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చాడు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్‌ సంస్థే నిర్మించనుంది. కానీ బాహుబలి2,3 పేరుతో ప్రభాస్‌ మాత్రం రాజమౌళి చేతిలో బందీగా మారిపోయాడు. దీంతో సుజీత్‌ మరెంత కాలం ప్రభాస్‌ కోసం వెయిట్‌ చేస్తాడో తెలియని పరిస్థితి. ఇక పవన్‌తో సర్దార్‌గబ్బర్‌సింగ్‌ కోసం దాదాపు రెండేళ్లకు పైగా వెయిట్‌ చేసిన సంపత్‌నంది ఆల్టర్‌నేటివ్‌గా రవితేజను చూసుకున్నాడు. ఇక హరీష్‌శంకర్‌ కూడా బన్నీని నమ్ముకొన్ని సమయం వృదా చేసుకొని చివరకు మరో మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌తో సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ చేశాడు. ఇలా స్టార్‌ హీరో అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి పరీక్షలు పెడుతున్నారు. కర్ర విరగకూడదు.. పాము చావకూడదు.. అనే సూత్రాన్ని స్టార్స్‌ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019