Advertisementt

అక్టోబర్‌ 21న నాన్నకు ప్రేమతో.. టీజర్‌ రిలీజ్‌!

Wed 21st Oct 2015 03:49 AM
ntr,sukumar,nannaku prematho movie,teaser released on october 21st  అక్టోబర్‌ 21న నాన్నకు ప్రేమతో.. టీజర్‌ రిలీజ్‌!
అక్టోబర్‌ 21న నాన్నకు ప్రేమతో.. టీజర్‌ రిలీజ్‌!
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి అండ్‌ రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో.. ఈ చిత్రం టీజర్‌ను విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు. 

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - విజయదశమి కానుకగా నాన్నకు ప్రేమతో.. టీజర్‌ని రేపు(అక్టోబర్‌ 21) సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించి 60 రోజులపాటు లండన్‌లో భారీ షెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు నవంబర్‌ 1 నుంచి స్పెయిన్‌లో నెలరోజుల పాటు మరో భారీ షెడ్యూల్‌ చెయ్యబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.. అన్నారు. 

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ